ముగిసిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-18T11:36:23+05:30 IST

ఇంటర్మీ డియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు మంగళ వారం ముగిశాయి. ఈనెల 4న

ముగిసిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 17: ఇంటర్మీ డియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు మంగళ వారం ముగిశాయి. ఈనెల 4న ప్రారంభమైన మొదటి సంవత్సరం పరీక్షలు మంగళవారంతో ముగిశాయి.  చివరి రోజు ఇంటర్మీడియట్‌  ప్రథ మ సంవత్సరం పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్‌ అయ్యారు. కెమిస్ట్రి, కామర్స్‌ పరీక్షకు మొ త్తం 20,046 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 19,196 మంది హాజరు కాగా 850 మం ది గైర్హాజరయ్యారు. నిజామాబాద్‌లోని ఆదర్శ హిందీ జూనియర్‌ కళాశాలలో ఇద్దరు విద్యా ర్థులు, ఆర్మూర్‌  మోడల్‌ స్కూల్‌లో ఒక విద్యార్థి మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతుండగా అధికారు లు పట్టుకొని డిబార్‌ చేశారు.


మూడు పరీక్షా కేంద్రాలను డీఐఈవో ఒడ్డెన్న తనిఖీ చేశారు. డీఈసీ కమిటీ, హెచ్‌పీపీ కమిటీ 17 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్‌ సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 16 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం తనిఖీలలో ఒక విద్యార్థి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ దొరకడం గమనించి ఆదర్శ హిందీ జూనియర్‌ కళాశాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ను విధుల నుంచి తొలగించి తదుపరి చర్యల కోసం నివేదిక పంపినట్లు డీఐఈవో ఒడ్డెన్న తెలిపారు.  

Updated Date - 2020-03-18T11:36:23+05:30 IST