ఇలా వచ్చి.. అలా వెళ్లారు!

ABN , First Publish Date - 2020-12-31T04:23:17+05:30 IST

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల సర్వే విషయం కొలిక్కి వచ్చే పరిస్థి తులు కనపడడం లేదనే వాదన లు వినిపిస్తున్నాయి.

ఇలా వచ్చి.. అలా వెళ్లారు!

కళాశాల భూముల సర్వేపై వెనుకడుగు ఎందుకో?
డిగ్రీ కళాశాల భూముల సర్వేకు కలెక్టర్‌ ఆదేశించినా ముందుకు సాగని సర్వే
భూముల సర్వేపూర్తిస్థాయిలో చేయకుండానే వెళ్లిపోతున్న సర్వేయర్లు
కబ్జా అయిన భూముల వద్దకు వచ్చే సరికి సర్వేచేయని పరిస్థితి
అన్యాక్రాంతమైన 6 ఎకరాల భూములను తేల్చని సర్వే అధికారులు
కనీసం సర్వే చేసిన  భూముల వద్ద హద్దులు చూపించని వైనం
ప్రతీ సారి దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న సర్వేయర్లు
కబ్జాదారులతో సర్వేయర్లు ములాఖత్‌ అయ్యారంటూ ఆరోపణలు
కామారెడ్డి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) / కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల సర్వే విషయం కొలిక్కి వచ్చే పరిస్థి తులు కనపడడం లేదనే వాదన లు వినిపిస్తున్నాయి. ఇటీవల కళా శాల భూముల కబ్జాపై వివాదం కొనసాగు తుండగా జిల్లా కలెక్టర్‌ శరత్‌ ప్రత్యేకంగా కళాశాల సిబ్బందితో, సర్వే అధికారులతో చర్చించి కళాశాల భూముల సర్వేను పకడ్బందీగా చేపట్టి వాటి పరిధిలను గుర్తించాలని ఆదేశించినప్పటికీ సర్వే యర్లు తూతూమంత్రంగా ఇలా వచ్చి.. అలా వెళ్లిపొతున్నారనే! విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కబ్జాకు గురైందని పేర్కొంటున్న భూముల వరకు వచ్చి నప్పుడలా తటపటాయిస్తు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారంటే సర్వే యర్లకు, కబ్జాదారులకు మధ్య ఏదైన ఒప్పందాలు ఉన్నాయా అనేదానిపై సర్వ త్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కలెక్టర్‌ సర్వేయర్లను దగ్గర ఉండి కబ్జా అయిన భూములను గుర్తించి హద్దులు పాతేదాక ఉండాలని సీరియస్‌గానే ఆదేశించినప్పటికీ కలెక్టర్‌ మాటలను మాత్రం సదరు అధికారులు బేఖాతారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు ఇతర పనులు ఉన్నాయంటూ పూర్తిస్థాయి సర్వే చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని కళాశాల పరిరక్షణ కమిటీ, విద్యార్థిసంఘ నాయకులు మండిపడుతున్నారు.
ఆరు ఎకరాల భూమి కబ్జాకు యత్నం
కామారెడ్డి కళాశాలకు సంబంధించిన భూముల ను రియల్టర్‌లు, స్థానిక నాయకులు కబ్జా చేస్తు న్నారనే ఆరోపణలు రావ డంతో మళ్లీ భూముల కబ్జాల లొల్లి నెలకొంటు న్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోనే ఎన్‌హెచ్‌ 7 రహదారి పక్కన వందల ఎకరా లలో కళాశాల భూములు ఉండ డం వీటి విలువ కోట్లలోనే పలుకుతుండడంతో స్థానికంగా ఉండే కొం దరి నేతల కన్ను ఈ భూములపై పడింది. కళాశాలకు చెందిన సుమా రు ఆరు ఎకరాల భూమిని ఇటీవల కాలంలో భూ కబ్జాదారులు, రియ ల్టర్‌లు, స్థానిక నాయకులు కబ్జా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. కబ్జా అయిన టీవీ టవర్‌, ఇందిరాగాంధీ స్టేడియం వెనుకభాగంలో, సబ్‌స్టేషన్‌ వెనుక భాగంలో ఉన్న సుమారు 6 భూములను స్థానికంగా ఉండే కొందరు రియల్టర్‌లు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని కళాశాల భూముల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సర్వే అధికారులు అక్కడక్కడ హద్దులు పాతిన వాటిని సైతం తొలగించి వారికి సంబంధించిన హద్దులను పాతినట్లు పేర్కొం టున్నారు. ఈ భూములను కబ్జా రాయుళ్ల చెర నుంచి విడిపించాలని జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేను కోరుతున్నారు.
వివాదంలో మరో 8.26 ఎకరాల భూమి
కామారెడ్డి ప్రభుత్వ కళాశాలకు 262 ఎకరాలలో భూములు ఉండేవి. అప్ప టి కాలేజీ ఎడ్యుకేషన్‌ పలు విద్యాసంస్థలకు, హాస్టళ్లకు, పోలీసుస్టేషన్‌, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, స్టేడియం, గోదాములతో పాటు తదితర వాటికి భూములను కేటా యించగా ప్రస్తుతం 158.9 ఎకరాల ఖాళీ భూములు ఉండగా వీటిని కళాశాల పేరిట గత 3 సంవత్సరాల కిందట అప్పటి కలెక్టర్‌ సత్యనారాయణ రిజిస్ట్రేషన్‌ చేశారు. ప్రస్తుతం ఈ భూములలోంచే పలుచోట్ల కబ్జాలకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాలు, కళాశాల పరిరక్షణ కమిటీ, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కళాశాలకు చెందిన 6 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారు. ఇవేకాకుండా గతం నుంచే కళాశాలకు చెందిన మరో 8.26 ఎకరా ల భూమి ఇప్పటికీ వివాదంలోనే ఉంది. ఈ భూమి తమేదనంటూ ప్రస్తుత కళా శాల ఆట స్థలంలో కొందరూ కబ్జాకు ప్రయత్నించడంతో ఆ భూములపై ఇరువ ర్గాల వారు కోర్టు మెట్లెక్కడంతో ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది.
సర్వే చేయకుండానే మరోసారి వెనుదిరిగిన సర్వేయర్‌
 కలెక్టర్‌ శరత్‌ ఆదేశాల మేరకు బుధవారం కళాశా ల బృందం భూముల సర్వేకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసుకుని సిద్ధ మయినప్పటికీ సర్వే కోసం అక్కడికి వచ్చి న కామారెడ్డి సర్వేయర్‌ అధికారులు నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుం చి తమకు వేరే పనులు ఉన్నాయని చెబుతూ కిందిస్థాయి సిబ్బందికి పనులు అప్పగించి వెళ్లిపోయారు. సర్వే సమయంలో ఏమైన గొడవలు జరుగుతాయని ముందస్తుగా పోలీసులు రక్షణ కోసం వచ్చినప్పటికీ సర్వేయర్లు లేకపోవడంతో సర్వే ను ఆపివేయాల్సి రావడంతో కళాశాల బృందం ఏమీ చేయలేక గంటల తరబడి వేచిచూసి వివాదాస్పద భూ ముల్లో సర్వే, హద్దులు పాతే ప్రక్రియ చేపట్టకుండానే వెనుదిరిగారు. ప్రతీసారి ఇలా రావడం గతంలో సర్వే చేసిన ప్రాంతాన్నే పలుమార్లు సర్వేచేసి కాలం వెల్లదీస్తున్నారు. మరుసటి రోజు మళ్లీ మొదటి నుంచి సర్వే చేయాలంటూ ప్రతీసారి దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు తప్పితే ఎక్కడ శ్రద్ధ వహించడం లేదని కళాశాల అధికారులు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. కలెక్టర్‌ ఆదేశించిన సర్వేయర్‌లు కాలయాపన చేస్తుండడంపై ఉన్నతాధికారి ఆదేశాలను ఏ మేరకు పాటిస్తూ తమ విధుల పట్ల ఎంత మేర చిత్తశుద్ధితో పని చేస్తు న్నారో అర్థం చేసుకోవచ్చనే విమర్శలను విద్యార్థి సంఘ నాయకులు, ప్రజాసంఘాల నాయకు లు వ్యక్తం చేస్తున్నారు. కలెక్ట ర్‌ తమకు అప్పగించిన పనుల పై అలసత్వం వహిస్తున్నారని ఎక్కడా తమపైన చర్యలకు పునుకుం టాడోనని వచ్చినట్టే వచ్చి కళాశాల బృందానికి మాత్రం పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు వినిపి స్తున్నాయి.

Updated Date - 2020-12-31T04:23:17+05:30 IST