వ్యవసాయ రుణాల శాతాన్ని పెంచాలి
ABN , First Publish Date - 2020-07-08T09:35:54+05:30 IST
జిల్లాలో వ్యవసాయ రుణాల శాతాన్ని పెంచాలని కలెక్టర్ నారాయణరెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు.

బ్యాంకర్లకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
నిజామాబాద్ అర్బన్, జూన్ 7: జిల్లాలో వ్యవసాయ రుణాల శాతాన్ని పెంచాలని కలెక్టర్ నారాయణరెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో వ్యవసాయ, కొవిడ్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రు ణాలపై బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ రుణాల శాతం తక్కువగా ఉందని, దీనిని పెంచి రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూ చించారు. బ్యాంకుల వారీగా రుణాలు ఇవ్వడంపై చర్చించారు.
కొవిడ్ లోన్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలోన్లు ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, వీలై నంత ఎక్కువ మందికి లోన్లు ఇవ్వాలన్నారు. రుణాలు ఇవ్వడం ఎంత ము ఖ్యమో రికవరీ చేయడం కూడా అంతే ముఖ్యమేనని కలెక్టర్ బ్యాంకు అధికా రులకు సూచించారు. ఈ సమావేశంలో నాబార్డ్ బ్యాంకు అధికారి కే.నగేష్, ఎల్డీఎం జెసన్, డీఆర్డీవో పీడీ రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
ధర్పల్లి: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ధర్పల్లి మ ండలంలోని దుబ్బాక, ధర్పల్లి గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా దుబ్బాక గ్రామంలో గల డబుల్ బెడ్రూం ఇళ్లు, శ్మశానవాటికల నిర్మాణం, పారిశుద్ధ్యం, మురికి కాలువల నిర్వహణ తదితర వాటిని పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే విధంగా చూడాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లో ఐదు భవనాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో గల శ్మశానవాటిక ఆవరణలో పార్కులు నాటాలన్నారు.
దుబ్బాక గ్రామం మోడల్ గ్రామంగా ఎంపికైనందున శ్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో పార్కు, పూలచెట్లను, పిల్లల ఆటస్థలాలను ఏ ర్పాటు చేయాలని తెలిపారు. గ్రామ వనసేవకుల ద్వారా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను రక్షించే విధంగా చూడాలన్నారు. ప్రతీ 400 చెట్లకు వన సేవకున్ని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో గల రై తుభవన నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సారికారెడ్డి, తహసీల్దార్ ఆనంద్, ఎంపీడీవో నటరాజ్ పాల్గొన్నారు.