కలెక్టర్, సీపీని కలిసిన బాధిత కుటుంబాలు
ABN , First Publish Date - 2020-12-10T06:19:33+05:30 IST
న్యావనంది గ్రామానికి చెందిన తర్ర గంగాధర్, పు ర్రె మమత కుటుంబ సభ్యులతో పాటు నాయకులు బుధవారం కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయను కలిశారు.

సిరికొండ, డిసెంబర్ 9 : న్యావనంది గ్రామానికి చెందిన తర్ర గంగాధర్, పు ర్రె మమత కుటుంబ సభ్యులతో పాటు నాయకులు బుధవారం కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయను కలిశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కలెక్టర్ నారాయణరెడ్డి హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. గంగాధర్ మృ తదేహం మూడు రోజులుగా చెట్టుకు వేలాడుతుంటే అదనపు డీసీపీ ఉషా వి శ్వనాథ్ చెప్పిన మాట ప్రకారం మంగళవారం రాత్రి సర్పంచ్ శ్రీనివాస్, యాద వ సంఘం పెద్దలు రమేష్, రాజుల గంగాధర్, మహిపాల్ యాదవ్, ఎం.మహి పాల్‌తో పాటు బాధిత కుటంబానికి చెందిన వారు కలెక్టర్, సీపీను కలిసి రెం డు సంఘటనలపై చర్చించారు. మమత హత్య కేసులో ఎలాంటి రాజకీయాలు లేవని కలెక్టర్ చెప్పారని వారు తెలిపారు. గంగాధర్ కుటుంబ సభ్యుడికి ఉద్యో గం విషయంలో పూర్తి హామీ లబించలేదన్నారు. ఆర్థిక సహాయం విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తానని కలెక్టర్ చెప్పారని వారు చె ప్పారు. రెండు కుటుంబాలకు ప్రభుత్వ భూమిని ఇప్పించగలుగుతానని చెప్పి నట్లు తెలిపారు. గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమి ఉంటే వెంటనే తీర్మానం చే సి పంపించాలని కలెక్టర్ సర్పంచ్ శ్రీనివాస్‌ను ఆదేశించారని ప్రతినిధులు తెలిపారు. మొత్తం మీద కలెక్టర్, సీపీ చర్చించిన విధానాన్ని బట్టి న్యాయం జరుగు తాదనే నమ్మకం కలుగలేదని యాదవ సంఘం సభ్యులు పెదవి విరిచారు.