రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-06-25T11:18:57+05:30 IST

ఆర్‌అండ్‌బీ రోడ్లపై ఆక్రమించిన స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకొని రోడ్డు కిరువైపులా మూడు వరుసలలో మొక్కలు

రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి : కలెక్టర్‌

సదాశివనగర్‌, గాంధారి, జూన్‌ 24: ఆర్‌అండ్‌బీ రోడ్లపై ఆక్రమించిన స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకొని రోడ్డు కిరువైపులా మూడు వరుసలలో మొక్కలు నాటాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం సదాశివనగర్‌, గాంధారి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌అండ్‌బీ రహదారులకు ఇరువైపులా మూడు వరుసల మొక్కలు నాటాలని, రోడ్ల పక్కలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. రోడ్డు పక్కన మొలిచిన చింత, వేప, మోదుగ మొక్కలను అలాగే ఉంచాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలతో గ్రామాల్లోని వీధులలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని కార్యదర్శులకు సూచించారు.


పల్లెప్రగతి పది ప్రమాణాలను పాటించాలన్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాల వద్ద మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ప్రతీ గ్రామానికి ఫాగింగ్‌ యంత్రం, శవపేటికల కోసం దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, డీపీవో సాయన్న, డీఎప్‌వో వసంత, ఎంపీపీ అనసూయ, సర్పంచ్‌ లలిత, ఎంపీడీవోలు అశోక్‌, రవి, ఈశ్వర్‌గౌడ్‌, తహసీల్దార్‌ రవీందర్‌, నాగరాజ్‌గౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధిహామీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-25T11:18:57+05:30 IST