హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-10T11:25:08+05:30 IST

హరితహారంలో మొక్కలు నాటి వంద శాతం సంరక్షించాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. గురు వారం ఆయన పట్టణంలోని గెలాక్సి ఫంక్షన్‌హాల్‌ వద్ద, మండలంలోని ఉగ్రవాయి వద్ద మొక్కను నాటారు.

హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించాలి : కలెక్టర్‌

కామారెడ్డి టౌన్‌, జూలై 9: హరితహారంలో మొక్కలు నాటి వంద శాతం సంరక్షించాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. గురు వారం ఆయన  పట్టణంలోని గెలాక్సి ఫంక్షన్‌హాల్‌ వద్ద, మండలంలోని ఉగ్రవాయి వద్ద మొక్కను నాటారు. మొక్కలు ఎండిపోతే వాటి స్థానం లో వెంటనే కొత్త మొక్కలు నాటాలన్నారు. వాటికి తప్పనిసరిగా కం చెలను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల కిరువైపులా మూడు వరుసలతో మొక్కలు నాటాలని, ఉపాధిహామీ పనులలో భాగంగా రోడ్లకిరువైపులా ముళ్లపొదలను, చెత్త కుప్పలను, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్‌ వెంకటే ష్‌దోత్రే, కమిషనర్‌ దేవేందర్‌, తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌, కౌన్సిలర్‌ రవీందర్‌గౌడ్‌, శ్యాం తదితరులు పాల్గొన్నారు.


సదాశివనగర్‌: హరితహారం లక్ష్యం చేరుకోవాలంటే పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలను సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా తీసుకొని సక్రమంగా ఎదిగేలా కృషి చేయాలని కలెక్టర్‌ శర త్‌ తెలిపారు. గురువారం మండలంలోని మర్కల్‌, తిర్మన్‌పల్లి గ్రామా ల్లో పర్యటించి హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మర్కల్‌ శ్మశానవాటిక వద్ద నాటిన మొక్కలు సక్రమంగా లేక పోవ డంతో ఒక్కింత అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీవో అశోక్‌, ఎంపీవో సతీష్‌కుమార్‌, ఏపీవో సృతి, సర్పంచ్‌ సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తాడ్వాయి: హరితహారంలో నాటిన మొక్కలకు ఏర్పాటు చేసిన పాదులు అధ్వానంగా ఉన్నాయని కలెక్టర్‌ శరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశా రు. నాటిన ప్రతీ మొక్కను బాధ్యతగా సంరక్షించాలని ఆయన అధికా రులకు సూచించారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో గురువారం ఆయన హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించా రు. గ్రామంలో వైకుంఠధామం పనులు, రైతునివేదిక పనులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీ, తమసీల్దార్‌ సాయి భుజం గరావు, సర్పంచ్‌ జంగం భూషణం, ఉప సర్పంచ్‌ తిరుపతిరెడ్డి, ఏపీవో శ్రీనివాస్‌, టీఏలు కృష్ణాగౌడ్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.


రామారెడ్డి: హరితహారంలో నాటిన మొక్కలను వంద శాతం బతికి ంచాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. గురువారం మండలంలోని గొల్లపల్లి, రామారెడ్డి, గోకుల్‌తండా, ఉప్పల్‌వాయి గ్రామాలలో పర్యటించారు. గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించి మొక్కల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పనులలో రోడ్లకు ఇరువైపుల ముళ్లపొదలు, చెత్తకుప్పలు, పిచ్చిమొక్కలు తొలగించాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, డీపీవో నరేష్‌, డీఎల్‌పీవో హరిసింగ్‌, ఎంపీపీ దశరత్‌రెడ్డి, ఎంపీ డీవో శంకర్‌ నాయక్‌, ఏపీవో ధర్మారెడ్డి, సర్పంచ్‌లు లావాణ్య, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఆగస్టు 31లోపు రైతువేదిక భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి

లింగంపేట: మండలంలోని మోతెలో నిర్మిస్తున్న రైతువేదిక భవన నిర్మాణ పనులను గురువారం కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. భవన నిర్మాణాన్ని ఆగస్టు 31లోపు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్ట ర్‌ను ఆదేశించారు. పనులు వేగవంతం చేయాలన్నారు. హరితహారం లో నాటిన ప్రతీ మొక్క బతికేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల ను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నారాయణ, వ్యవసాయ అధికారి సాయి రమేష్‌, ఏఈ రాకేష్‌, సర్పంచ్‌ రాంరెడ్డితో పాటు అధికారులు ఉన్నారు.

Updated Date - 2020-07-10T11:25:08+05:30 IST