సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2020-12-29T05:27:36+05:30 IST

కేంద్ర వ్యవసాయ చట్టాల విష యంలో సీఎం కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకోవడాన్ని తప్పుబడుతూ బోధ న్‌లో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ, సిరికొండలో ఏఐకేఎంఎస్‌ ఆధ్వ ర్యంలో సోమవారం సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
సిరికొండలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దృశ్యం

బోధన్‌ /సిరికొండ, డిసెంబరు 28 : కేంద్ర వ్యవసాయ చట్టాల విష యంలో సీఎం కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకోవడాన్ని తప్పుబడుతూ బోధ న్‌లో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ, సిరికొండలో ఏఐకేఎంఎస్‌ ఆధ్వ ర్యంలో సోమవారం సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలంటూ ప్రకటనలు చేసి బంద్‌లో పాల్గొన్న టీఆర్‌ ఎస్‌ నాయకులు ఈ వ్యవహారంపై స్పందించాలన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని బంద్‌కు మద్దతు పలికి ఢిల్లీ వెళ్లిరాగానే యూటర్న్‌ తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ పార్టీ సబ్‌డివిజన్‌ కార్యదర్శి మల్లేష్‌, ఏఐకేఎంఎస్‌ నాయ కుడు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల రామకృష్ణ, డివిజన్‌ ఉపాధ్యక్షుడు రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T05:27:36+05:30 IST