235 కోట్ల మొక్కలు నాటేందుకు సీఎం కృషి

ABN , First Publish Date - 2020-02-12T11:43:58+05:30 IST

సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో రాష్ట్రంలో హరితహారంలో 235 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక చేశార ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిఅన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు వనాన్ని సందర్శించారు. ఈ సంద

235 కోట్ల మొక్కలు నాటేందుకు సీఎం కృషి

కామారెడ్డి, ఫిబ్రవరి 11: సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో రాష్ట్రంలో హరితహారంలో 235 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక చేశార ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిఅన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు వనాన్ని సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మొక్కలు నాటి అనంతరం మాట్లాడారు. బాన్సువాడ, భిక్కనూరు, మా చారెడ్డి, దోమకొండ మండలాల్లో వర్షాలు ఎ క్కువగా కురుస్తున్నాయని, కామారెడ్డి ప్రాం తంలో వర్షాలు తక్కువగా పడటానికి కార ణం చెట్లు తక్కువగా ఉండటమేనన్నారు. కా మారెడ్డి జిల్లా కేంద్రంలో మొక్కలను విసృ త్తంగా నాటాలన్నారు. 3500 మొక్కలతో హ రిత రక్షక్ష వనాన్ని ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వ ర్యంలో నిర్వహించడం, పర్యావరణ సమత్యు లతకు పాటుపడటం అభీనందనీయమన్నా రు. ఈ సందర్భంగా పోలీసులను అభినందిం చారు. పర్యావరణం, పచ్చదనాన్ని కాపాడకప కపోతే జల ప్రళయం వస్తుందన్నారు. చెట్లు అంతరించి పోతే వాతావారణంలో 57డిగ్రీలు పెరిగి మంచు కొండలు కరిగి నదుల రూ పంలో ముంపు ఏర్పడుతుంద న్నారు. ఈ కా ర్యక్రమంలో ఎస్పీ శ్వేతారెడ్డి, అసిస్టెంట్‌ కలె క్టర్‌ తేజాస్‌ నందలాల్‌పవార్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జహ్నవి, అడిషనల్‌ ఎస్పీ అన్యోన్య, డీ సీ ఎంఎస్‌ చైర్మన్‌ ముజీబోద్దీన్‌, నారాగౌడ్‌ త దిరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-12T11:43:58+05:30 IST