తరగతులు సరే.. పరీక్షలు ఎలా?

ABN , First Publish Date - 2020-12-11T04:49:19+05:30 IST

కరోనా విపత్తు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రంగానే పడింది. గత ఏడాది మార్చిలో కరోనా మహమ్మారి వెలుగుచూడ గానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించి.. అప్పటికే ఇంటర్‌ పరీక్షలు ముగియడంతో పది పరీక్షలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మిగతా తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్‌ అయ్యారు. పది విద్యార్థులను సైతం పాఠశాలలోని అంతర్గత మార్కుల ఆధారంగా పాస్‌ చేశారు. ఇలా గత ఏడాది విద్యాసంవత్సరం కరోనా కష్టకాలంలో ముగిసింది.

తరగతులు సరే.. పరీక్షలు ఎలా?

ఇంటర్‌, పది పరీక్షలపై స్పష్టత కరువు

అసలు పరీక్షలు ఉంటాయా? లేదా? 

గందరగోళంలో జిల్లాలోని సుమారు 60 వేల మంది విద్యార్థులు

బోధన్‌, డిసెంబరు 10 : కరోనా విపత్తు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రంగానే పడింది. గత ఏడాది మార్చిలో కరోనా మహమ్మారి వెలుగుచూడ గానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించి.. అప్పటికే ఇంటర్‌ పరీక్షలు ముగియడంతో పది పరీక్షలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మిగతా తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్‌ అయ్యారు. పది విద్యార్థులను సైతం పాఠశాలలోని అంతర్గత మార్కుల ఆధారంగా పాస్‌ చేశారు. ఇలా గత ఏడాది విద్యాసంవత్సరం కరోనా కష్టకాలంలో ముగిసింది. కానీ ఈ ఏడాది విద్యాసంవత్సరాన్ని సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించి ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు పాఠశాలలకు హాజరు అయ్యేలా నిబంధనలు విధించింది. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులతోపాటు మన టీవి ద్వారా పాఠ్యాంశాలు బోధించేలా ఏర్పాట్లు చేశారు. గత మూడు నెలలుగా దాదాపు విద్యాసంవత్సరం కొనసాగుతూ వస్తోంది. అయితే, ఈ ఏడాది ఇంటర్‌, పది తరగతుల విద్యార్థుల భవి ష్యత్తుపై గందరగోళం నెలకొంది. ఆన్‌లైన్‌ తరగతులు, దూరదర్శన్‌ పాఠాలు బాగానే ఉన్నా.. పరీక్షల మాటేమిటి అన్న ది సందిగ్ధంగా మారింది. ప్రతియేటా దసరా నుంచి దీపావళి మధ్యకాలంలో అంటే అక్టోబరు, నవంబరు మాసాలలో ఇంటర్‌, పది విద్యార్థుల పరీక్షల ఫీజుల నోటిఫికేషన్‌ వచ్చేది. పరీక్ష ఫీజుల చెల్లింపు కొనసాగేది. కానీ ఈ ఏడాది ఇప్ప టికీ ఇంటర్‌, పది పరీక్షలపై స్పష్టత లేకుండా పోయింది. 

నిజామాబాద్‌ జిల్లాలో సుమారు 60వేల మంది విద్యార్థులు

నిజామాబాద్‌ జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో సుమారు 26వేల మంది విద్యార్థులు పదో తరగతి, సుమారు 34 వేల మంది ఇంటర్‌ చదువుతున్నారు. ప్రతియేటా జూన్‌ మాసంలో విద్యా సంవత్సరం ప్రారంభమైతే అక్టోబరు, నవంబరు మాసాలలో పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ జారీ అయ్యేది. ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రతియేటా దసరా, దీపావళి మధ్య కాలంలో పరీక్షల ఫీజుల చెల్లింపునకు నోటిఫికేషన్‌ జారీ చేసేది. అపరాధ రుసుంతో దాదాపు సంక్రాంతి వరకు ఇంటర్‌, పది పరీక్షల ఫీజుల చెల్లింపు కొనసాగేది. అయితే, ఈ ఏడాది కరోనా కష్టకాలం కారణంగా విద్యా సంవత్సరం సెప్టెంబరు మాసంలో మొదలైంది. ప్రభుత్వమే అధికారికంగా విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను సెప్టెంబరు మొదటి నుంచి ప్రకటించింది. ఇప్పటికే సెప్టెంబరు మొదటి నుంచి అటు కళాశాలలు, ఇటు పాఠశాలలో ఆన్‌లైన్‌ తరగతులు, దూరదర్శన్‌ ద్వారా టీవీలలో పాఠ్యాంశాల బోధన జరుగుతోంది. దాదాపు సగానికిపైనే సిలబస్‌ పూర్తైంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంటర్‌, పది విద్యార్థులకు దాదాపు సిలబస్‌ సగానికిపైనే ముగిసింది. మరోవైపు ప్రభుత్వం సైతం విద్యా సంవత్సరం ఆలస్యం కావడంతో కొన్ని పాఠ్యాంశాలను ఇంటర్‌, పది సిలబస్‌ నుంచి తొలగించి సిలబస్‌ను కుదించింది. ఈ నేపథ్యంలో దాదాపు ఇంటర్‌, పది విద్యార్థుల సిలబస్‌ పూర్తి అయ్యింది. కానీ పరీక్ష ఫీజులకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పటికి వెలువడలేదు. మార్చి, ఏప్రిల్‌, మే మాసాలలో ఇంటర్‌, పది పరీక్షలు ప్రభుత్వం నిర్వహించాలనుకున్నా.. పరీక్షల ఫీజులకు సంబంధించి నోటిఫికేషన్‌ రాకపోవడం గందరగోళానికి తెరలేపుతోంది. అసలు ఈ ఏడాది ఇంటర్‌, పది విద్యార్థులకు పరీక్షలు ఉంటాయా? లేదా? అన్నది స్పష్టత కరువైంది. ఇప్పటి వరకు పరీక్షల ఫీజుల నోటిఫికే షన్‌ రాకపోతే విద్యార్థులు ఎప్పుడు పరీక్ష ఫీజులు చెల్లిస్తా రు? పరీక్షలు ఎప్పుడు ఉంటాయి? అన్నది గందరగోళంగా మారింది. ఈ వ్యవహారంలో అటు విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైతం గందరగోళ పరిస్థి తులు నెలకొన్నాయి. ఒకవేళ పరీక్షలు లేకపోతే ఆన్‌లైన్‌ క్లా సులు నిర్వహించి టీవీల ద్వారా పాఠ్యాంశాలు బోధించి ఏం లాభమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట ప్రైవేటు విద్యాసంస్థలు వేలాది రూపాయల ఫీజు లు వసూలు చేశాయని, పరీక్షలు లేకపోతే ఎలా అని అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు సందేహాలను ఎదుర్కొంటు న్నారు. పరీక్షలను నిర్వహించే పరిస్థితులు లేనప్పుడు ప్రభు త్వం ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట అనుమతులు ఇచ్చి అటు వి ద్యార్థులను, ఇటు తల్లిదండ్రులను ఎందుకు గందరగోళానికి గురి చేసిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరీక్షలు లేకపోతే ఈ ఏడాది ఇంటర్‌, పది విద్యార్థు లు ఉన్నత తర గతులకు ఎలా వెళ్తారని? విద్యా సంవత్సరం ఉంటుందా? లేదా? ఏడాది కోల్పోవాల్సి వస్తుందా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 

ప్రాజెక్టులు, అసైన్‌మెంట్‌లు ఉంటాయా? లేదా?

పది విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మా రింది. ప్రతియేటా పదో తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో అంతర్గత మార్కులు ఉంటాయి. ప్రతీ సబ్జెక్టుకు 20 అంతర్గ త మార్కులు పాఠశాలల్లోనే వేస్తారు. విద్యార్థులు తయారు చేసే ప్రాజెక్టులు, అసైన్‌మెంట్‌ల ఆధారంగా ఈ మార్కులు వేయడం జరుగుతుంది. ఈ మార్కుల ఆధారంగా గత ఏ డాది పదో తరగతి విద్యార్థుల గ్రేడింగ్‌లను ప్రభుత్వం ప్రక టించింది. కానీ ఈ ఏడాది ఇప్పటికీ ప్రాజెక్టులు, అసైన్‌మెం ట్‌ల పైన ప్రభుత్వం స్పష్టతను ఇవ్వలేదు. ఆన్‌లైన్‌ క్లాసులు, టీవీ తరగతులతో కాలయాపన చేస్తూ వస్తుంది. పరీక్షల నో టిఫికేషన్‌ రాకపోవడం? పరీక్షలు ఉంటాయో? లేదో? తెలి యకపోవడం ఉంటే ప్రాజెక్టులు, అసైన్‌మెంట్‌లను రాయా లా? వద్దా? వాటికి మార్కులు ఉంటాయా? లేదా? తెలియ ని గందరగోళం నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవ హారాలపై స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. లేనట్లైతే పది విద్యార్థు లు మరింత ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇ ప్పటికైనా ప్రభుత్వం, మేధావులు, విద్యావేత్తలు, తల్లిదండ్రు లు, విద్యార్థుల అభిప్రాయాలను పరిగనలోకి తీసుకొని  పరీ క్షలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. విద్యా సంవత్సరంలో పరీక్షల వ్యవహారంపై ప్రకటన చేయాల్సి ఉంది. లేదంటే మరింత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎంతైనా ఉంది. 

Updated Date - 2020-12-11T04:49:19+05:30 IST