చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్
ABN , First Publish Date - 2020-12-19T06:06:22+05:30 IST
చైల్డ్‌లైన్ 1098 కామారెడ్డి ఆధ్వర్యంలో పద్దెనిమిదేళ్లలోపు బాలల రక్షణ- సంరక్షణ నిమిత్తం మండలంలోని రెడ్డిపేటలో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ సవిత తెలిపారు.

రామారెడ్డి, డిసెంబరు 18: చైల్డ్‌లైన్ 1098 కామారెడ్డి ఆధ్వర్యంలో పద్దెనిమిదేళ్లలోపు బాలల రక్షణ- సంరక్షణ నిమిత్తం మండలంలోని రెడ్డిపేటలో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ సవిత తెలిపారు. 1098 కామారెడ్డి చైల్డ్‌లైన్ పర్యవేక్షణలో బాలల రక్షణ, వారి సంరక్షణ చేపడుతున్నట్లు వివరించారు. బాల్య వివాహాలు, ఆపదలో ఉన్న బాలల సమాచారాన్ని 1098కి అందిం చాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సునంద, ఉప సర్పంచ్ బాలయ్య, ఎంపీటీసీ గర్గుల రాజాగౌడ్, కార్యదర్శి అరవింద్‌రెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది సౌమ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.