చలో హైదరాబాద్‌’ను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-30T04:54:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కిసాన్‌ ఖేత్‌ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి అన్నారు.

చలో హైదరాబాద్‌’ను విజయవంతం చేయాలి

మోపాల్‌, డిసెంబరు 29:  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కిసాన్‌ ఖేత్‌ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి అన్నారు. మంగళవారం ముప్ప గంగారెడ్డి మోపాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నెల 26వ తేదీ నుంచి రైతులు ఢిల్లీలో ప్రజాస్వామిక పద్ధతిలో రైతులు ఉద్యమం చేస్తున్నారన్నారు. కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రైతాంగ డిమాండ్‌లను కేంద్రప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 


Updated Date - 2020-12-30T04:54:53+05:30 IST