నగరంలో చైన్‌స్నాచింగ్‌

ABN , First Publish Date - 2020-12-01T06:10:00+05:30 IST

నగరంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఓ మహిళ మెడలోనుంచి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్టు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.

నగరంలో చైన్‌స్నాచింగ్‌

నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు
గుడికి వెళ్తుండగా జరిగిన ఘటన

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 30: నగరంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఓ మహిళ మెడలోనుంచి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్టు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నగరంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సాయినగర్‌కు చెందిన అనిత తోటి మహిళలతో కలిసి సోమవారం గుడికి వెళ్తుండగా, అభయాంజనేయస్వామి ఆలయం వద్ద వారి ఎదురుగా ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని రెండున్నర తులాల నల్లపూసలు, సుమారు రెండు తులాల బంగారు చైను తెంపుకొని పరారయ్యారని బాధితురాలు అనిత ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ లక్ష్మయ్య వివరించారు.

Updated Date - 2020-12-01T06:10:00+05:30 IST