బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ వృద్ధుడిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-12-26T05:32:34+05:30 IST

నిజామాబాద్‌ మండలం జలాల్‌పూర్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన వృద్దుడి(60)పై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు.

బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ వృద్ధుడిపై కేసు నమోదు

నవీపేట, డిసెంబరు 25 : నిజామాబాద్‌ మండలం జలాల్‌పూర్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన వృద్దుడి(60)పై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరిలో గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో బాలికలకు చాక్లెట్‌లు, పది రూపాయల చొప్పున ఇస్తానని ఆశచూపించి వారిపై వృద్ధుడు అత్యచారానికి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. ఈ విషయాన్ని బాలికలు కుటుంబ సభ్యులకు తెలుపడంతో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసులను నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2020-12-26T05:32:34+05:30 IST