ఫారెస్టు అధికారిపై దాడికి యత్నించిన ఇద్దరిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-03-13T12:11:13+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి బీట్‌ ఆఫీసర్‌ రజిత విధులకు ఆటంకం కలిగించడంతోపాటు

ఫారెస్టు అధికారిపై దాడికి యత్నించిన ఇద్దరిపై కేసు నమోదు

నవీపేట(ఎడపల్లి), మార్చి 12 : నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి బీట్‌ ఆఫీసర్‌ రజిత విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఆమెపై దాడికి యత్నించిన ఇద్దరిపై కేసు నమోదు చే సినట్టు ఎస్సై ఎల్లగౌడ్‌ తెలిపారు. మండలంలోని కుర్నాపల్లి శివారులో ఉన్న ఒర్రెలో బుధవారం సా యంత్రం రామస్వామి, కుమార్‌ అనే ఇద్దరు వ్యక్తులు అనుమతి లేకుండా ఇసుకను తీసి తరలి స్తుండగా బీట్‌ ఆఫీసర్‌ రజిత అడ్డుకుందని, ఆ సమయంలో బీట్‌ ఆఫీసర్‌ రజితను నెట్టివేసి ఆమె ఫో న్‌ పగులగొట్టడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై పేర్కొన్నారు. గురువారం బీట్‌ ఆఫీ సర్‌ రజిత ఫిర్యాదు చేయగా ఆమె ఫిర్యాదు మేరకు కుర్నాపల్లికి చెందిన రామస్వామి, కుమార్‌ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2020-03-13T12:11:13+05:30 IST