కారు ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి

ABN , First Publish Date - 2020-11-26T06:09:22+05:30 IST

భీమ్‌గల్‌ మండలంలోని చేంగల్‌ గ్రామంలో బుధవారం కారు ఢీకొని మూడేళ్ల చిన్నారి మంద వైనవి మృతిచెందింది.

కారు ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
మృతిచెందిన చిన్నారి వైనవి

భీమ్‌గల్‌ రూరల్‌, నవంబరు 25:  భీమ్‌గల్‌ మండలంలోని చేంగల్‌ గ్రామంలో బుధవారం కారు ఢీకొని మూడేళ్ల చిన్నారి మంద వైనవి మృతిచెందింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెం దిన మంద నవీన్‌ వారం రోజుల కిందట గల్ఫ్‌ నుంచి వచ్చి చేంగల్‌ గ్రామంలో నూతన గృహ ప్రవేశం చేసుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి కలిగోట్‌ గ్రామానికి చెందిన ఊళ్లెంగ గంగాధర్‌ టీఎస్‌16ఎఫ్‌ఏ5347 ఇండికా కారులో వస్తున్న క్ర మంలో ఇంటిముందర ఆడుకుంటున్న నవీన్‌ మూడేళ్ల కుమార్తె వైనవిని ఢీకొనగా ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని ఆర్మూర్‌లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రవీకరించారు.  భీమ్‌ గల్‌ ఏఎస్‌ఐ చిరంజీవులు ఆధ్వర్యంలో వైనవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నవీన్‌ ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-26T06:09:22+05:30 IST