వ్యవసాయ, విద్యుత్‌ బిల్లులను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T05:14:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన వ్యవసా య, విద్యుత్తు బిల్లులను రద్దుచేయాలని భారత కార్మిక సంఘాల సమా ఖ్య నాయకులు అన్నారు.

వ్యవసాయ, విద్యుత్‌ బిల్లులను రద్దు చేయాలి
కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

పెద్దబజార్‌, డిసెంబరు 5: కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన వ్యవసా య, విద్యుత్తు బిల్లులను రద్దుచేయాలని భారత కార్మిక సంఘాల సమా ఖ్య నాయకులు అన్నారు. ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేం ద్రంలోని బస్టాండ్‌ ఎదురుగా కేంద్ర ప్రభుత్వ దిష్ట్టిబొమ్మను దహనం చే శారు. అనంతరం బస్టాండ్‌ నుంచి ధర్నాచౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించా రు. రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8న  భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని కో రారు. కార్యక్రమంలో ఎల్‌బీ రవికుమార్‌, శివకుమార్‌, మోహన్‌, గంగాద ర్‌, ఫిరోజ్‌, రాజు, రాజ్‌కుమార్‌, శంకర్‌, వీరయ్య, విజయ్‌ పాల్గొన్నారు. 

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా 

నిజామాబాద్‌ అర్బన్‌ : కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత రైతు పోరాట సమన్వయ జిల్లా క మిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు రణధీర్‌ మాట్లాడారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను మోడి ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు పోరాడుతామన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేసే విధానాలను కేంద్రం మానుకోవాలని హెచ్చరించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలను బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌లతో  దాడులు చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో భాస్కర్‌, రాష్ట్ర  కా ర్యదర్శి ప్రభాకర్‌, గంగారెడ్డి, వరదయ్య, భూమయ్య, రమేష్‌బాబు, ఆకుల పాపయ్య, ఎల్‌బీ రవి, దేవరాం, జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌, రామకృష్ణ, భాస్కర్‌, భూమన్న తదితరులు పాల్గొన్నారు. 

బోధన్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

బోధన్‌: బోధన్‌లో శనివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఢిల్లీలో రైతాంగం చేస్తు న్న ఆందోళనలకు మద్దతుగా బోధన్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. పదిరోజులుగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నా కేంద్ర ప్రభు త్వం స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. వ్యవసాయ వ్యతిరేక బి ల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న కేంద్రం పక్కదారి పట్టించేలా మాట్లాడడం హాస్యాస్పదమ న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు మరింత ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్‌అప్ప, షేక్‌బాబు, మల్లేష్‌, పోశెట్టి, సంజ య్‌, సాయి, లింగామణి, గంగన్న, సాయిలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:14:29+05:30 IST