వివరాలు నమోదు చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-06T05:08:26+05:30 IST
18 ఏళ్లు నిండిన యువతీ, యు వకులు ఓటు జాబితాలో వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.

నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 5: 18 ఏళ్లు నిండిన యువతీ, యు వకులు ఓటు జాబితాలో వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఖిల్లా ప్రాంతంలోని సెయింట్ మేరి స్కూల్, హబీబ్‌నగర్‌లోని క్రైం బ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. బూత్ లెవల్ అధి కారులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 18 ఏళ్లు నిండి న వారు ఓటు హక్కు కోసం వివరాలు నమోదు చేసుకునేలా చూడాలని తెలిపారు. మధ్యాహ్నం ఇంటింటికీ తిరిగి ఫాం-6 భర్తీ చేయించాలన్నారు. పోలింగ్‌బూత్ వారీగా ఓటరు లిస్టులో ఉన్న మొత్తం ఓటరు జాబితాకు 4 శాతం 18 సంవత్సరాలు లోపు వారిని నమోదు చేసే విధంగా చూడాలని సూచించారు. ఫాం-7, 8, 8ఏ ద్వారా మార్పులు చేర్పులతో పాటు చ నిపోయిన వారి పేర్లు తొలగించాలని ఆదేశించారు. రెండు రోజులు త ప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలలో ఫాంలు అందుబాటులో ఉంచాలన్నారు. మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, సిబ్బంది పాల్గొన్నారు.
విజయ డెయిరీ పార్లర్ ప్రారంభం
నగరంలోని డ్వాక్రాబజార్, సుభాష్‌నగర్ రైతుబజార్‌లో విజయ డెయి రీ పార్లర్‌లను శనివారం ఎండీ శ్రీనివాస్‌రావు, కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజయ డెయిరీ పార్లర్ల కోసం 50 దరఖాస్తులు వచ్చాయన్నారు. పార్లర్ పెట్టుకునే వారికి 50 శాతం సబ్సిడీతో కూలింగ్ ఫ్రీజ్ లు ఇవ్వనున్నట్లు చెప్పారు. డెయి రీ పెట్టాలనుకునే వారు డ్వాక్రా బ జార్‌లోని పార్లర్‌లో అందజేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎ ల్‌డీఎం జయసంతోష్, జీఎం రమే ష్, డీడీ నందకుమారి తదితరులు పాల్గొన్నారు.
పనులు పూర్తి కావాలి..
అధికారులకు అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయాలని క లెక్టర్ ఆదేశించారు. శనివారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో మాట్లాడారు. రైతు వేదిక పనులు ఇంకా ఏమైనా ఉంటే మూడు, నా లుగు రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. కాంట్రాక్టర్ల పని చేయకుంటే వారి స్థానంలో మరొకరిని ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణిలో పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలని తెలిపారు. గత యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లర్ల నుంచి రావాల్సిన సీఎంఆర్ వెంటనే పం పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వానకాలంలో ఇప్పటి వర కు 5 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. 950 కోట్ల రూపాయలకు గాను ఇప్పటి వరకు 850 కోట్ల రూపాయలను చె ల్లించామని అన్నారు. ధాన్యం సేకరణ, డబ్బులు చెల్లింపుల విషయంలో అధికారుల కృషి అభినందనీయమని ప్రశంసించారు. పల్లెప్రగతి వనాల పనులు వేగంగా చేయాలని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సదుపాయా లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీ లాడ్స్, సీడీపీ పనులు వేగం గా పూర్తి చేసేలా అధికారుల ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.