పొలం పనుల్లో బిజీ..బిజీ

ABN , First Publish Date - 2020-06-18T11:12:57+05:30 IST

జిల్లాలో జూన్‌ మొదటివారంలోనే వర్షాలు పడడంతో రైతులు పంటల సాగును మొదలుపెట్టారు

పొలం పనుల్లో బిజీ..బిజీ

ప్రారంభమైన వానాకాలం సాగు

మొక్కజొన్న సాగు వైపు పలువురు రైతుల మొగ్గు 

సోయా విత్తనాల కోసం తప్పని తిప్పలు


నిజామాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో జూన్‌ మొదటివారంలోనే వర్షాలు పడడంతో రైతులు పంటల సాగును మొదలుపెట్టారు. కొన్ని మం డలాల పరిధిలో ఎక్కువ, కొన్ని మండలాల పరిధిలో ఓ మోస్తరు వర్షం పడడంతో సాగును చేస్తున్నారు. విత్తనాలు దొరికిన విఽధంగా పంటలను వేస్తున్నా రు.  ప్రభుత్వం నియంత్రిత విధానంలో లాభసాటి పంటలను వేయాలని కోరడంతో  వరి సాగుచేసే రైతు ల ఎక్కువగా సన్నరకాలపై మొగ్గుచూపుతున్నారు. జిల్లా లో ఈ వానాకాలంలో 5.35 లక్షల ఎకరాల్లో  సాగవుతుందని అంచనా వేశారు. వీటిలో 3.60 వరి, 65 వేల ఎకరాల్లో సోయా, 56 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 40  వేల ఎకరాల్లో పసుపు సాగవుతుందని మొదట అం చనా వేశారు. ప్రభుత్వం మొక్కజొన్న వేయవద్దని కోరడంతో ఆ విస్తీర్ణంలో సోయా, పత్తి, కంది సాగుచేయాలని అధికారులు కోరారు. జిల్లాలో గడిచిన 15 రోజులు గా పంటల సాగు కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 35 వేల ఎకరాల్లో పం టలను వేశారు. జిల్లాలోని బోధన్‌ డివిజన్‌లో 5175 ఎకరా ల్లో వరి నాట్లను వేశారు. ముం దు నారుమళ్లు పోసిన రై తులు ప్రతిరోజూ నాట్లను వేస్తుండగా మిగతా వారు నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు.


జిల్లాలో 65  శాతానికి పైగా విస్తీర్ణంలో వరి సాగు కానుండడంతో ముందస్తుగా ఏర్పాట్లను చేసుకుంటున్నారు. జిల్లాలో సోయాబీన్‌ ఇప్పటి వరకు 17,280 ఎకరాలు, మొక్కజొన్న 5,789 ఎకరాలు, పసుపు 6,608 ఎకరాల్లో వేశారు. మిగతా పంటలను కూడా సాగు మొదలుపెట్టారు. జిల్లాలో వరి వేసే రైతులు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి సన్నరకాలను తెచ్చుకుంటున్నారు. కొంత మంది రైతులు మాత్రం తక్కువ సమయంలో పంట వచ్చే అవకాశం ఉన్న విత్తనాలను ఉపయోగిస్తున్నారు. జిల్లాలో జల్లులు పడుతున్నందున రైతులు సాగు మొదలు పెట్టారని ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్‌ హుస్సేన్‌ తెలిపారు. కావలసిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచామని తెలిపారు. 


సోయా విత్తనాల కోసం రైతుల తిప్పలు...

రైతులు సోయా విత్తనాల కోసం తిప్పలు పడుతున్నారు. సొసైటీల ద్వారా ఒకటి, రెండు బస్తాలను మా త్రమే ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీల ద్వారా సరఫరా తక్కువగా ఉండడంతో రైతులు ఇతర ప్రాంతాలపైన దృష్టి పెట్టారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, బిలోలి, దెగ్లూర్‌, కిన్వట్‌తో పాటు ఆదిలాబాద్‌, నిర్మల్‌ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. సబ్సిడీలో సోయా విత్తనాలు దొరకకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో తెచ్చుకొని విత్తుకుంటున్నారు. ఈ సీడ్‌ సర్టిఫైడ్‌ కాకపోవడం వల్ల పండుతుందా లేదా అన్న ఆందోళనలో కొంత మంది రైతులు  ఉన్నారు. వర్షాలు పడిన రీతిలోనే ఈ పంటను వేస్తున్నారు. 

Updated Date - 2020-06-18T11:12:57+05:30 IST