గుండెపోటుతో కారులోనే వ్యాపారి మృతి
ABN , First Publish Date - 2020-12-11T05:12:25+05:30 IST
బోధన్‌లో గురువారం తెల్లవారుజామున కారులోనే ఓ వ్యాపారి మృతిచెందాడు.

మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బోధన్‌లో ఘటన
బోధన్, డిసెంబరు 10: బోధన్‌లో గురువారం తెల్లవారుజామున కారులోనే ఓ వ్యాపారి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని పార్సిగుట్టకు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌కు మహారాష్ట్రలో వ్యాపార లావాదేవీలుండడంతో తరచూ వెళ్లివస్తుంటాడని పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు సొంత ఇన్నోవా వాహనంలో వెళ్తుండగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గుండెపోటు రాగా, కారును పక్కకు ఆపి అక్కడే ఉండిపోయాడు. కారులోనే గుండెపోటు తీవ్రత పెరగడంతో ప్రాణాలు కోల్పోయాడని పట్టణ సీఐ రామన్ తెలిపారు. కారులో రూ.5లక్షల వరకు నగదు, ఇతర పత్రాలు లభించడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. గుండెపోటుతోనే కారులో మృతిచెందాడని, ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. కారులోని నగదు, ఇతర పత్రాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు.