త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2020-08-18T10:56:42+05:30 IST

బోధన్‌ ప్రభుత్వ ఆసుప త్రిలో నాసిరకం పనుల వ్యవహారం వెలుగుచూ సింది. సోమవారం తెల్లవారుజామున నవజాత శిశువుల వార్డులో సీలింగ్‌ ..

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

బోధన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువుల వార్డులో కుప్పకూలిన సీలింగ్‌

లక్షలాది రూపాయల పనుల్లో  నాణ్యత కరువు


బోధన్‌, ఆగస్టు 17: బోధన్‌ ప్రభుత్వ ఆసుప త్రిలో నాసిరకం పనుల వ్యవహారం వెలుగుచూ సింది. సోమవారం తెల్లవారుజామున నవజాత శిశువుల వార్డులో సీలింగ్‌ కుప్పకూలింది. లక్ష లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన పనులు మున్నాళ్ల ముచ్చటగా మారాయి. బినామీ కాం ట్రాక్టర్‌లు చేపట్టిన నాణ్యతలేని పనులు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించినా నాణ్యత లేని పనులు చేయడం వల్లనే పీఓపీ సీలింగ్‌ కుప్పకూలింద న్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మూడు రో జుల పాటు కురిసిన వర్షాలకు సీలింగ్‌ కుప్పకూ లడం తీవ్ర ఆరోపణలకు తావిస్తోంది. త్రుటిలో ప్రమాదం తప్పినా ఈ వ్యవహారం మాత్రం ప నుల నాణ్యతను ప్రశ్నిస్తోంది. బోధన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది క్రితం సుమారు రూ.60 లక్షల నుంచి రూ.80లక్షల వర కు వెచ్చించి ఆధునికీకరణ పనులు చేపట్టారు. నవజాత శిశువుల ఇంటేన్సివ్‌కేర్‌ వార్డును పీఓ పీతో ఆధునికీకరించి అన్ని రకాల హంగు ఆర్భా టాలు చేశారు.


లక్షలాది రూపాయల విలువైన యంత్ర సామగ్రిని ఈ గదులలోనే ఉంచారు. అ యితే, ఈ పనులు కొనసాగిన నాటి నుంచే తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. బినామీ కాంట్రా క్టర్‌లు పనులను చేపడుతున్నారని, నాసిరకం ప నులు కొనసాగుతున్నాయని, పనుల నాణ్యతపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. వై ద్య, ఆరోగ్య శాఖ అధికారులు పనుల నాణ్యతపై దృష్టి పెట్టకపోవడం బినామీ కాంట్రాక్టర్‌లను ప్ర శ్నించే పరిస్థితి లేకపోవడంతో ఏడాదికే పనుల నాణ్యతలో డొల్లతనం వెలుగుచూసింది. ఆసుప త్రిలో కొనసాగుతున్న ప్రతీ పని నాణ్యత లేకుం డానే బినామీల ఆధ్వర్యంలో కొనసాగాయన్న ఆ రోపణలు మొదటి నుంచే ఉన్నాయి. నవజాత శి శువుల వార్డులో సీలింగ్‌ కుప్పకూలి పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆ సమయంలో వార్డులో ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. మ రో వైపు విలువైన యంత్ర సామగ్రికి నష్టం వా టిల్లింది.


ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి అధికా రులు విచారణ చేపట్టాల్సి ఉంది. లక్షలాది రూ పాయలతో మరమ్మతు పనులు మొక్కుబడిగా నిర్వహించడం బినామీ కాంట్రాక్టర్‌ల వ్యవహారం పై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ వ్యవ హారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థా నికులు కోరుతున్నారు. మరోవైపు ఇంజనీర్‌ల బృ ందం ఈ వ్యవహారంపై నివేదికను సిద్ధం చేసిం ది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అన్నపూర్ణ సెల వులో ఉండడం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న సందీప్‌కుమార్‌ తనకేమి తెలియదని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదికను పంపుతామని స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-18T10:56:42+05:30 IST