అన్ని దానాల కన్నా..రక్తదానం మిన్న!

ABN , First Publish Date - 2020-05-02T06:42:54+05:30 IST

అన్ని దానాల కన్నా.. రక్తదానం గొప్పదని, యువత ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేసి ఆదుకోవాలని మాజీ ఎంపీ

అన్ని దానాల కన్నా..రక్తదానం మిన్న!

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత


నిజామాబాద్‌ అర్బన్‌, మే 1: అన్ని దానాల కన్నా.. రక్తదానం గొప్పదని, యువత ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేసి ఆదుకోవాలని మాజీ ఎంపీ కవిత పిలుపుని చ్చారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించు కొని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలు పు మేరకు వారం రోజుల పాటు రక్తదాన శిబిరాన్ని కొన సాగిస్తున్నారు.


దీంతో శుక్రవారం మాజీ ఎంపీ కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అత్యవసర పరిస్థి తుల్లో రక్త దానం మనుషులను కాపాడుతుందన్నారు. తలసేమియా, అత్యవసర చికిత్సలకు ఈ రక్తదానం ఎం తో ఉపయోగపడుతుందన్నారు. సమాజ సేవలో ఎల్ల ప్పుడు ముందుండే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, జాగృతి కార్య కర్తలు వీలైనంత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలను నిర్వహించాలని ఆమె కోరారు.

Updated Date - 2020-05-02T06:42:54+05:30 IST