కల్వర్టును ఢీకొన్న బైకు.. ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
ABN , First Publish Date - 2020-12-11T05:15:31+05:30 IST
కామారెడ్డిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నిజామాబాద్ వెళ్తుండగా బైకు అదుపు తప్పి బీబీపూర్ తండా 44వ జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు.

డిచ్‌పల్లి, డిసెంబరు 10: కామారెడ్డిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నిజామాబాద్ వెళ్తుండగా బైకు అదుపు తప్పి బీబీపూర్ తండా 44వ జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన కందుకూరి ప్రేమ్‌రాజ్ (32), ఆయన సోదరుడు నరేష్ గురువారం కామారెడ్డిలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని బైకుపై తిరిగి వస్తుండగా బీబీపూర్ తండా వద్ద రహదారిపై బైకు ప్రమాదవశాత్తు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో వెనుక కూర్చున్న ప్రేమ్‌రాజు తలకు బలమైన గాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని ఎస్‌ఐ తెలిపారు. ఇదే ఘటనలో బైకు నడుపుతున్న నరేష్ ఎడమ కాలు విరిగిందని, ప్రేమ్‌రాజు తోడల్లుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామన్నారు.