బాన్సువాడ మున్సిపాలిటీలో భువన్‌ సర్వే

ABN , First Publish Date - 2020-09-01T10:00:34+05:30 IST

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ సిబ్బందితో కలిసి భువన్‌ సర్వే ప్రారంభించారు. ఈ

బాన్సువాడ మున్సిపాలిటీలో భువన్‌ సర్వే

బాన్సువాడ టౌన్‌,  ఆగస్టు 31  : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ సిబ్బందితో కలిసి భువన్‌ సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో భాగంగా ప్రతీ ఇంటికి జియో ట్యాగింగ్‌ చేస్తున్నామని, భవన నిర్మాణాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జుబేర్‌, జిల్లా కోఆర్డినేటర్‌ సునీల్‌గౌడ్‌, ఆర్‌ఐ దత్తురెడ్డి, నితిన్‌, మసూద్‌,  ముజఫర్‌ తదితరులున్నారు. 


Updated Date - 2020-09-01T10:00:34+05:30 IST