కూలీలకు భలే డిమాండ్‌

ABN , First Publish Date - 2020-06-22T11:06:43+05:30 IST

వాతావరణంలో మా ర్పులు ఏర్పడి.. వర్షాలు కురుస్తుండడం.. రై తులు వరినాట్లకు సిద్ధం అవుతుండడంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో

కూలీలకు భలే డిమాండ్‌

మగవారికి రూ.700, ఆడవారికి రూ.500 పైనే రోజు కూలి

ఎకరం వరినాటుకు గుత్తకు రూ.4,500 పైనే

బోధన్‌ డివిజన్‌లో ఊపందుకుంటున్న వరినాట్లు


బోధన్‌, జూన్‌ 21: వాతావరణంలో మా ర్పులు ఏర్పడి.. వర్షాలు కురుస్తుండడం.. రై తులు వరినాట్లకు సిద్ధం అవుతుండడంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో కూలీలకు భలే డిమాండ్‌ ఏర్పడింది. వ్యవ సాయ కూలీల కొరత ఏర్పడడంతో కూలి ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలో వరినా ట్ల సమయంలో కామారెడ్డి జిల్లా పరిధిలో ని నిజాంసాగర్‌, పిట్లం, బిచ్కుంద, జుక్కల్‌ మండలాలతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి కూలీలు వరినాట్లు వేసే ందుకు పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. ని త్యం ఆటోలు, ట్రాక్టర్‌లలో పెద్ద ఎత్తున కూలీలు వచ్చి వర్ని కూలీ అడ్డాలో దర్శన మిచ్చేవారు. ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యా ప్తి నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి వచ్చే కూలీలు లేకపోవడం ఇతర ప్రాంతాల ను ంచి కూలీలు వచ్చేందుకు భయపడుతుండ డం, ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి కూలీ లు వచ్చిన రైతులు భయపడే పరిస్థితులు ఉండడంతో ఎక్కడికక్కడ వ్యవసాయ కూ లీల కొరత ఏర్పడింది.


కూలీలకు భలే డి మాండ్‌ నెలకొంది. వరినాట్లు పెరుగుతుం డడంతో కూలీలకు డిమాండ్‌ ఏర్పడి కూలీ ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. వ్యవసాయ బోర్ల వద్ద బోధన్‌ డివిజన్‌ పరి ధిలోని వర్ని, చందూరు, మోస్రా, రుద్రూ రు, కోటగిరి, బోధన్‌, ఎడపల్లి, రెంజల్‌, నవీ పేట మండలాలతోపాటు బాన్సువాడ డివి జన్‌ పరిధిలోని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాలలో వరినాట్లు ఊపందుకున్నా యి. వరినాట్లు రోజురోజుకు పెరుగుతుండ డం కూలీల ధరలు పెరిగేలా చేస్తున్నాయి.


ప్రస్తుతం వరినాట్లకు వచ్చే కూలీ లకు మగవారికి రోజుకు 700 రూపాయలు, ఆడ వారికి 500 రూపా యల పైనే కూలీ చెల్లించాల్సిన ప రిస్థితి ఏర్పడింది. వరినాట్లు వేసే మహిళలు ఉద యం 6 గంటలకే వరినాట్ల వద్దకు చేరుకొని సాయంత్రం వరకు వరినా ట్లను వేస్తూ ఎక రాల చొప్పున గుత్తా తీసుకు ంటున్నారు. ఒక్కో ఎకరా కు వరినాటు వేసేందుకు మహిళలు 4వేల నుంచి 4500 రూపా  యల వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వ్యవసాయ కూలీల జోష్‌ కొన సాగుతోంది. బోర్ల వద్ద వరి నాట్లు ముమ్మ రం కావడంతో ఎక్కడికక్కడ కూలీల కొరత ఏర్పడి కూలీలకు డిమాండ్‌ నెలకొంది. 

Updated Date - 2020-06-22T11:06:43+05:30 IST