మెరుగ్గా.. మున్సిపాలనా

ABN , First Publish Date - 2020-09-13T09:23:01+05:30 IST

పల్లె ప్రగతితో గ్రామాల ముఖ చిత్రాలను ఆదర్శంగా తీసుకుని మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం ..

మెరుగ్గా.. మున్సిపాలనా

కామారెడ్డి, సెప్టెంబరు 12: పల్లె ప్రగతితో గ్రామాల ముఖ చిత్రాలను ఆదర్శంగా తీసుకుని మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజలకు ప్రభు త్వానికి క్షేత్ర స్థాయిలో వారధిగా ఉండే విధంగా వార్డుకో అధికారిని నియ మించనుంది. పారిశుధ్యం, హరితహారం, పౌరసేవలు, పథకాలు సమర్థవ ంతంగా నిర్వహించడానికి ఈ వ్యవస్థ మరింత దోహపడుతుందని ప్రభు త్వం భావిస్తోంది. పల్లెల్లో సర్వతోమూఖాబివృద్ధికి నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల ముఖచిత్రాలు మారి పోయాయి. ఈ స్థాయిలోనే మున్సిపాలిటీల్లో అన్ని వసతులు కల్పించి పారిశుధ్య నిర్వహణకు పెద్ద పీట వేయాలని పట్టణ ప్రగతిని చేపట్టినా ఆశించిన ఫలితాలు రాబట్టలేక పోయామని అందువల్ల మున్సిపాలిటీలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని నిర్ణయిచినట్లు.


ఇందుకు గాను వార్డుకో ప్రత్యేకఽధికారిని నియమించబో తున్నామని ఇటీవల రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పలు సందర్భాలలో అన్న మాటలివి. అందుకనుగుణంగా మున్సిపాలిటీల్లో ప్రతీ వార్డుకో అధికారిని నియమిస్తే సత్ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో ఈ వ్యవస్థ కార్యరూపం దాల్చనుండడంతో ఆయా పట్టణాలలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.


జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో 80 వార్డులు

జిల్లాలో మొత్తం 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 80 వార్డులున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు, బాన్సువాడలో 19 వార్డులు, ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులో ఒక్కో వార్డుకు ఒక అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వర లో ఈ నియామకాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న ట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 


పెరుగుతున్న భారం

ప్రజల అవసరాలు, సౌకర్యాల దృష్ట్యా మున్సిపాలిటీల్లో జనాభా విస్తృత ంగా పెరుగుతోంది. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలలో పూర్తి అధికార, పర్యవేక్షణ బాధ్యత కమిషనర్‌పైనే ఉంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌లో, ఇంజనీరింగ్‌ విభాగంలో, రెవెన్యూ విభా గంలో పలు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగు తోంది. దీంతో వార్డుల్లో సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించ లేక పోతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ముఖ్యంగా పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. చాలా వార్డుల్లో మంచి నీటి సమస్య సైతం ఇప్పటికీ విపరీతంగా ఉంది. ఇలా పలు సమస్య లను తెలుసుకోవడం, పర్యవేక్షించడం, పరిష్కరించడం జరగ డం లేదు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉండడంతో వార్డుకో అఽధికారిని నియమించ డానికి ప్రభుత్వం సన్నా హాలు చేస్తోంది. దీంతో మున్సి పల్‌ కమిషనర్‌లపై భారం తగ్గుతుందని భావిస్తోంది. ఇప్పటికే రానున్న ఐదేళ్లలో మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రగతిని నిర్వహించిన ఫలితాలు ఆశించి నంతగా కనిపించలేదు.


సమాచారం రావాల్సి ఉంది.. దేవేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

మున్సిపాలిటీల్లో వార్డుకో అధికారిని నియమి ంచే విషయంలో తమకు ఇంకా స్పష్టమైన సమాచా రం రావాల్సి ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా నడుచుకుంటాం. వార్డుకో అధి కారిని నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. నియామకం జరిగి తమకు కేటాయిస్తే మున్సిపా లిటీ అభివృద్ధిలో వారి సేవలు వినియోగించుకుంటాం.

Updated Date - 2020-09-13T09:23:01+05:30 IST