మూడో విడత సర్వే ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-29T05:17:17+05:30 IST

పట్టణంలోని నాలుగో వార్డులో ఐసీఎంఆర్‌ ఆధ్వ ర్యంలో మూడో విడత సైరో సర్వేను సోమవారం డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ ప్రారంభించారు.

మూడో విడత సర్వే ప్రారంభం

కామారెడ్డిటౌన్‌, డిసెంబరు 28: పట్టణంలోని నాలుగో వార్డులో ఐసీఎంఆర్‌ ఆధ్వ ర్యంలో మూడో విడత సైరో సర్వేను సోమవారం డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వే ద్వారా కరోనా ఎంతమందికి సోకిందోననే విషయం తెలుసుకోవచ్చని తెలిపారు. గతంలో చేపట్టిన రెండు సర్వేలో రాష్ట్రంలోనే కామారెడ్డిలో తక్కువ వ్యాప్తి ఉందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఎని మిదో వార్డు పరిధిలోని ప్రజలకు కరోనా టెస్ట్‌ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్‌ నిట్టుకృష్ణమోహన్‌ తెలిపారు. 29న లక్ష్మీనగర్‌, జీవదాన్‌కాలనీ, 30న జీఆర్‌ కాలనీ, వికాస్‌నగర్‌, ఏపీహెచ్‌బీ కాలనీల్లో టెస్టులు నిర్వహిస్తున్నారని, ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని తెలిపారు.

Updated Date - 2020-12-29T05:17:17+05:30 IST