‘బీడీ కార్మికులకు వేతనాలు ఇప్పించాలి’

ABN , First Publish Date - 2020-04-07T10:41:24+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాల ని ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినందున బీడీ కార్మికులకు, ప్యాకర్ల కు యాజమాన్యం నుంచి వేతనాలు ఇప్పించాలని సోమవారం కా మారెడ్డి

‘బీడీ కార్మికులకు వేతనాలు ఇప్పించాలి’

కామారెడ్డి, ఏప్రిల్‌ 6: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాల ని ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినందున బీడీ కార్మికులకు, ప్యాకర్ల కుయాజమాన్యం నుంచి వేతనాలు ఇప్పించాలని సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ గోపిరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. బీడీకార్మికులకు పనిలేదని బీడీ కార్మికులకు నెలకు రూ.5 వేలు. ప్యాకర్లకు రూ.20 వేలు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భం గా జిల్లా కన్వీనర్‌ సదానందం మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గత 22వ తేదీ నుంచి రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలు బంద్‌ చేయడం ద్వారా రాష్ట్రంలోని 8 లక్షల మంది బీడీ కార్మికులకు, ప్యాకర్లకు ఉపాధి లేకుండా పోయిందని తెలిపారు.


బీడీ యాజమాన్యాలు ఆర్థికంగా ఆ దుకోవాలని ఫీఎఫ్‌, ఈఎస్‌ఐ ఉన్న కార్మికులకు ఈఎస్‌ఐ, లీవ్‌ కింద పరిగణించి బంద్‌ ఉన్న రోజుకు వేతనాలు, కూలీ ఇవ్వాలని బీడీ యాజమాన్యం మానవత దక్పథంలో కార్మికులను ఆదుకోవాలని కో రారు. కార్యక్రమంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం జి ల్లా కన్వీనర్‌ కమ్మరి సదానందం, జిల్లా కో కన్వీనర్‌ గంగామణి, జి ల్లా నాయకుడు హబ్దుల్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-07T10:41:24+05:30 IST