కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-05-29T11:10:08+05:30 IST

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ

కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలి

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ 


నిజామాబాద్‌ అర్బన్‌, మే 28: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం సమావేశం ఆయన అధ్యక్షతన కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో డి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనాపై ప్రజలు అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు దాంతో సహజీవనం చేయాల్సిందేనని అన్నారు. దానిని తరిమికొట్టాలంటే ము ఖానికి మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్నురుకాపు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T11:10:08+05:30 IST