మరింత జాగరూకతతో కట్టడి చేయాలి

ABN , First Publish Date - 2020-05-11T09:36:01+05:30 IST

జిల్లాలో కరోనా కట్టడిలో మరింత జాగరూకతతో పనిచేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచించారు.

మరింత జాగరూకతతో కట్టడి చేయాలి

షాపుల వద్ద మాస్కులు తప్పనిసరి ధరించాలి

ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలి

జూలై నాటికి 75 శాతం ఎరువులను 

రైతులకు అందుబాటులో ఉంచాలి

సమీక్ష సమావేశంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి 


నిజామాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా కట్టడిలో మరింత జాగరూకతతో పనిచేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచించారు. ఆది వారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో కరోనా కట్టడి, ధాన్యం సేకరణ, ఎరువుల లభ్యత, రుణ మాఫీపై అధి కారులతో సమీక్షించారు. జిల్లాలో కరోనా కట్టడికి ఇప్ప టికే చాలా చేశామన్నారు. అదే స్ఫూర్తితో ముందుకు పోవాలన్నారు. ఈ సమస్య సమసిపోలేదన్నారు. ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనాపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లాక్‌డౌన్‌ నిబందనలు పాటించే విధంగా చూడాలన్నారు. ప్రజలు అవ సరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీ యనియంత్రణ పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు ప్ర జలను అప్రమత్తం చేయడంతో పాటు కఠినంగా లాక్‌ డౌన్‌ను అమలుచేయాలన్నారు. ఇదే రీతిలో కొనసాగి స్తే గ్రీన్‌జోన్‌లోకి వెళతామన్నారు. ప్రజల సహకారాన్ని తీసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులు, మాంసం, కూరగాయలు అమ్మే దుకాణాలతో పాటు ఇతర దుకా ణాల వద్ద మాస్కులు, గ్లౌజులు ధరించే విధంగా చూ డాలన్నారు.


భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని గుర్తించి హోంక్వారంటైన్‌లో ఉంచాలన్నా రు. వారిని పరిశీలిస్తూ బీపీ, షుగర్‌, టీబీ ఉన్న వారిని గుర్తించి మందులు అందే విధంగా చూడాలన్నారు. ముంబై, ఔరంగాబాద్‌, నాగ్‌పూర్‌ నుంచి వచ్చే వారి లి స్టును ప్రత్యేకంగా తయారుచేయాలన్నారు. వారిని హోంక్వారంటైన్‌లో ఉంచాలన్నారు. ఆశ వర్కర్‌లు, ఏ ఎన్‌ఎంలు విధిగా వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించా లన్నారు. ధాన్యం కొనుగోళ్లు అనుకున్న విధంగా పూర్తి చేయాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా మొత్తం ధా న్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే ట్రాక్టర్‌ లను వినియోగించి ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించా లన్నారు.


రుణమాఫీకి అర్హులైన వారిని గుర్తించాలన్నా రు. ఆధార్‌ లింకు లేని వారికి వెంటనే అవకాశం కల్పిం చి లింక్‌ చేయాలన్నారు. వ్యవసాయ ఏఈవోల ఆధా రంగా నెంబర్‌లు తీసుకొని బ్యాంకర్‌లు ఆన్‌లైన్‌ చేయా లన్నారు. వచ్చే వానకాలం పంటలను దృష్టిలో పెట్టుకొ ని జులై నాటికి 75 శాతం ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, అదనపు కలెక్ట ర్‌లు చంద్రశేఖర్‌, లత, జేడీఏ గోవింద్‌, డీసీవో సింహా చలం, డీఎంఅండ్‌హెచ్‌వోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-11T09:36:01+05:30 IST