నగదు రహిత లావాదేవీలపై అవగాహన
ABN , First Publish Date - 2020-12-19T05:44:59+05:30 IST
ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవిలపై మండలంలోని శెట్పల్లిలో గ్రామంలో నాబార్డు ఆధ్వర్యంలో ఎన్‌డీసీసీబీ సిబ్బంది గ్రా మస్థులు అవగాహన కల్పించారు.

లింగంపేట, డిసెంబరు 18: ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవిలపై మండలంలోని శెట్పల్లిలో గ్రామంలో నాబార్డు ఆధ్వర్యంలో ఎన్‌డీసీసీబీ సిబ్బంది గ్రా మస్థులు అవగాహన కల్పించారు. ప్రతీ ఒక్కరు బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలని కేసీసీ కార్డు ఉపయోగాలు, ఆన్‌లైన్ మోసాల గురించి జాగ్రత్తలను ప్రజలకు వివరిం చారు. బ్యాంకు ఇన్సూరెన్స్ స్కీంలు, ఏటీఎం కార్డు ఉపయోగాలు, ఏటీఎం పీన్ నెంబరు ఎవరికి చెప్పవద్దని వారికి సూచించారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ కుమారస్వామి, డైరెక్టర్ శ్రీను, సర్పంచ్ పద్మ ఉన్నారు.