ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆటో
ABN , First Publish Date - 2020-12-14T04:39:25+05:30 IST
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఆటో ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇ లా ఉన్నాయి.. కోటగిరి మండలం పొతంగల్ చెక్‌పోస్టు వద్ద ఆది వారం రాత్రి ట్రాక్టర్ ఆగి ఉంది.

ఒకరు మృతి, నలుగురికి గాయాలు
బోధన్, డిసెంబరు13: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఆటో ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇ లా ఉన్నాయి.. కోటగిరి మండలం పొతంగల్ చెక్‌పోస్టు వద్ద ఆది వారం రాత్రి ట్రాక్టర్ ఆగి ఉంది. బోధన్ నుంచి పొతంగల్ ప్రయాణికులతో ఆటో వెళ్తుంది. ఆటో వేగం వచ్చి ట్రాక్టర్‌ను వెనుక నుం చి ఢీకొట్టింది. ఆటో డ్రైవర్‌తో పాటు ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్సులో బోధన్ ఏరి యా ఆస్పత్రికి తరలిస్తుండగా, ఒకరు మృతిచెందాడు. మృతుడు మద్నూర్ మండలం మదన్‌ఇప్పర్గకు చెందిన రాజుగా గుర్తించా రు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.