సహకారంలోనూ ఆగని వేలం

ABN , First Publish Date - 2020-02-08T12:19:03+05:30 IST

సహకార సం ఘాల పదవుల వేలం పాటలు జోరుగా కొన సాగుతున్నాయి. వేలం పాటలను అధికారు లు పట్టించుకోకపోవడంతో మిగతా గ్రామా ల్లో కూడా వేలం

సహకారంలోనూ ఆగని వేలం

  • జిల్లాలో సహకార సంఘాల పదవులకు జోరుగా వేలం
  • రూ.25.05 లక్షలు పలికిన శెట్‌పల్లి సొసైటీ చైర్మన్‌ పదవి
  • రూ.23.60 లక్షలకు పడిగెల చైర్మన్‌ పదవి కైవసం
  • వేలంలో చైర్మన్‌ పదవులను దక్కించుకుంటున్న అధికార పార్టీ నేతలు
  • చోద్యం చూస్తున్న జిల్లా యంత్రాంగం

ఆర్మూర్‌: సహకార సం ఘాల పదవుల వేలం పాటలు జోరుగా కొన సాగుతున్నాయి. వేలం పాటలను అధికారు లు పట్టించుకోకపోవడంతో మిగతా గ్రామా ల్లో కూడా వేలం వేయానికి గ్రామాభివృద్ధి కమిటీలు సన్నాహాలు చేస్తున్నాయి. శుక్రవా రం పలు గ్రామాలలో వేలం పాట నిర్వహిం చారు. శనివారం కూడా గ్రామాలల్లో వేలం పాటలు నిర్వహించే అవకాశముంది. ఇప్పటి కే ఆర్మూర్‌ మండలం పిప్రి, వేల్పూర్‌ మండ లం పడిగెల, కమ్మర్‌పల్లి మండలం కోనస ముందర్‌, మోర్తాడ్‌ మండలం శెట్‌పల్లి సం ఘాల చైర్మన్‌ పదవులు వేలం వేశారు. కొన్ని గ్రామాలల్లో డైరెక్టర్‌ పదవులు కూడా వేలం వేశారు. వేల్పూర్‌ మండలం పడిగెల చైర్మన్‌ పదవి రూ.23.60లక్షలు పలికింది. పడిగెల సొసైటీ పరిధిలో పడిగెల, పోచంపల్లి, కుకు నూర్‌, కోమన్‌పల్లి, పోచంపల్లి గ్రామాలున్నా యి. పడిగెల గ్రామంలోనే ఆరు టీసీలున్నా యి. ఇతర గ్రామాల వారు ఒక్కరు మద్ధతి స్తే పడిగెల గ్రామానికి చెందిన వారు చైర్మ న్‌ అయ్యే అవకాశం ఉంది. పడిగెల గ్రామం లో రూ.23.60లక్షలకు వేలం పాడిన నాయ కుడే కోమన్‌పల్లి టీసీతో ఒప్పందం చేసుకు న్నట్లు తెలిసింది. కోమన్‌పల్లిలో టీసీ పదవి రూ.6.30లక్షలు పలికింది. వైస్‌చైర్మన్‌ పదవి వచ్చే అవకాశముండడంతో ఈ టీసీకి డి మాండ్‌ ఏర్పడింది. కోనసముందర్‌ చైర్మన్‌ పదవి రూ.10లక్షలు పలికింది. కోనస ముం దర్‌ సొసైటీ వైస్‌చైర్మన్‌ కొనసాగుతున్న నా యకుడు టెండర్‌లో చైర్మన్‌ పదవి దక్కిం చుకున్నారు. మోర్తాడ్‌ మండలం శెట్‌పల్లి సొసైటీ చైర్మన్‌ పదవిని వేలం వేశారు. దొ న్కల్‌కు చెందిన వ్యక్తి రూ.25.05లక్షలకు ద క్కించుకున్నారు. కోనసముందర్‌, పడిగెల, శె ట్‌పల్లి చైర్మన్‌లుగా ఎన్నికయ్యే అభ్యర్థులు సొంత డబ్బులే చెల్లించాలి.


టీసీలకు పెరిగిన డిమాండ్‌..


సహకార సంఘాలకు 1995లో ప్రత్యక్ష పద్ధతిలో జరిగాయి. ఆ తర్వాత పరోక్ష పద్ధ తిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతీ సొ సైటీలో 13డైరెక్టర్లు ఉంటారు. వీరే చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లను ఎన్నుకుంటారు. ఒక్కో సొసై టీ పరిధిలో నాలుగైదు గ్రామాలున్నాయి. ఎ క్కువ టీసీలు ఉన్న గ్రామంలో గంపగుత్తగా టెండర్‌ వేస్తున్నారు. ఈ గ్రామంలో టెండర్‌ దక్కించుకున్న నాయకుడు మిగతా ఒకటి, రెండు టీసీల కోసం పరిధిలోని గ్రామాల వై పు పరుగెత్తుతున్నారు. ఒకటి, రెండు టీసీల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. నందిపేట్‌ మండలంలో ఒక టీసీ రూ.6లక్ష లు పలికింది. ఆర్మూర్‌ మండలంలో రెండు టీసీలు రూ.11లక్షలు పలికాయి. వేల్ఫూర్‌ మండలంలో ఒక గ్రామంలో రూ.6.50లక్షలు పలికింది. నందిపేట్‌ మండలం డోంకేశ్వర్‌ సొసైటీ పరిధిలోని నికల్‌పూర్‌ గ్రామంలో రెండు టీసీలను రూ.15.60లక్షలకు వేలం వే శారు. బాల్కొండ సొసైటీ పరిధిలోని జలాల్‌ పూర్‌లో ఉన్న ఏకైక టీసీని రూ.4లక్షల 5వేల కు, నాగాపూర్‌ గ్రామంలో రూ.2లక్షల ఒక వె యికి వేలం వేశారు. ప్రతీ గ్రామంలో టీసీల కు మంచి ధర పలుకుతోంది.


పోటీపడుతున్న అధికార పార్టీ నేతలు..


సహకార సంఘాల ఎన్నికల్లో బీజేపీ, కాం గ్రెస్‌ పార్టీల ప్రభావం కనిపించడం లేదు. అధికార పార్టీ నాయకులే మధ్యే పోటీ నెల కొంది. పదవి దక్కించుకోడానికి అధికార పా ర్టీ నాయకులు అక్రమ మార్గంలో వెళ్తున్నా రు. ఆర్మూర్‌ మండలం పిప్రి గ్రామంలో అ ధికార పార్టీ నాయకుడు రూ.70లక్షలు ప్రభు త్వం నుంచి మంజూరు చేయిస్తానని ఒప్పం దం చేసుకున్నాడు. ఆయన చేతి నుంచి ఒ క్క పైసా ఖర్చు చేయడం లేదు. ప్రభుత్వ నిధులు మంజూరు చేయించడమే ఆయన బాధ్యత. మిగతా గ్రామాలలో అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ నాయకులే వేలంలో పాల్గొన్నారు.


చోద్యం చూస్తున్న అధికారులు..


ఆర్మూర్‌ ప్రాంతంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. వేలంలో పాల్గొన్న వారంద రూ అధికార పార్టీ నాయకులే కావడంతో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహారిస్తు న్నారు. గతంలో స్థానిక సంస్థల పదవులు వేలం వేస్తే ఎన్నిక వాయిదా వేశారు. వేలం వేసిన వారి మీద కేసులు నమోదు చేశారు. ఈ సారి చర్యలు తీసుకోడానికి అధికారులు భయపడుతున్నారు.


ఆర్మూర్‌లో రసవత్తరం..


ఆర్మూర్‌ సొసైటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ప్రాంతంలోని అందరి దృష్టిని ఈ ఎన్నిక ఆకర్షిస్తోంది. ఆర్మూర్‌ పట్టణం లోని బీసీ, ఎస్సీ రైతులందరూ ఏకమై వారి అభ్యర్థులను నిలుపుతున్నారు. ఆర్మూర్‌ సొ సైటీలో మున్నూరుకాపు సామాజిక వర్గం ఎ క్కువగా ఉంది. ఈ సామాజిక వర్గం నాయ కుడినే చైర్మన్‌ చేయాలనే పట్టుదలతో ఉన్నా రు. ఏం జరుగుతుందో చూడాలి.

Updated Date - 2020-02-08T12:19:03+05:30 IST