రేపు వాహనాల విడిభాగాలకు వేలంపాట
ABN , First Publish Date - 2020-12-06T05:17:39+05:30 IST
పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల వినియోగ అనంతరం వాటి కాలపరిమితి పూర్తయిన వాహనాల విడి భాగాలను ఈనెల 7న జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వేలంపాట నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు.
నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 5: పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల వినియోగ అనంతరం వాటి కాలపరిమితి పూర్తయిన వాహనాల విడి భాగాలను ఈనెల 7న జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వేలంపాట నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టైర్లు, ట్యూబ్స్, వాహనాల బ్యాటరీలు, ఇంజన్ ఆయిల్, బ్యారెల్స్, స్పేర్ పార్ట్స్‌కు వేలంపాట ఉంటుందన్నారు.