ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
ABN , First Publish Date - 2020-12-14T05:18:19+05:30 IST
డిచ్‌పల్లి బస్టాండ్‌లో ఉన్న ఏటీఎంను గత రాత్రి గుర్తు తెలియని దుం డగులు ధ్వంసం చేశారనీ పోలీసులు తెలిపారు. ఏటీఎంలో ఉన్న డబ్బులు బయటికి రాకపోవడంతో దొంగలు ఏటీఎంను పగల గొట్టారు.

డిచ్‌పల్లి, డిసెంబరు 13: డిచ్‌పల్లి బస్టాండ్‌లో ఉన్న ఏటీఎంను గత రాత్రి గుర్తు తెలియని దుం డగులు ధ్వంసం చేశారనీ పోలీసులు తెలిపారు. ఏటీఎంలో ఉన్న డబ్బులు బయటికి రాకపోవడంతో దొంగలు ఏటీఎంను పగల గొట్టారు. ఏటీఎం వస్తువు లను చిందరవందర చేశారు. నెల కిందటే ఈ ఏటీ ఎంను దొంగలు పగలగొట్టిన విషయం మరవక ముందే మరోసారి చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డిచ్‌పల్లి పోలీ సులు కేసు నమోదు చేసుకొని దార్యప్తు చేస్తున్నారు. రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఏటీఎంలే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాలుపడుతుండడంతో స్థా నిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రుల్లో పోలీసుల భద్రత నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపరులు కోరుతున్నారు.