మజీద్‌కమిటీపై ఇరువర్గాల దాడులు
ABN , First Publish Date - 2020-12-27T06:04:55+05:30 IST
మండల కేంద్రంలోని జేఎన్‌సీ కాలనీలోని మజీద్ కమిటీ వ్యవహరంలో ఇరువర్గాలు దాడులకు దిగాయి.

రుద్రూరు సీఐ కార్యాలయం ఎదుట ఘర్షణ
పోలీసుల లాఠీచార్జి
రుద్రూరు, డిసెంబరు 26: మండల కేంద్రంలోని జేఎన్‌సీ కాలనీలోని మజీద్ కమిటీ వ్యవహరంలో ఇరువర్గాలు దాడులకు దిగాయి. సీఐ కార్యాలయం ఎదు టే దాడులకు దిగగా పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొ చ్చారు. జేఎన్‌సీ కాలనీలోని మజీద్ నూతన కమిటీ, పాత కమిటీల మధ్య వివా దం నెలరోజులుగా కొనసాగుతోంది. శనివారం రెండు వర్గాల సభ్యులు సమస్య పరిష్కారానికి సీఐ కార్యాలయానికి వచ్చారు. మాటమాట పెరిగి కార్యాలయం ఎదుటే ఒకరిపైకొకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఎస్సై రవీందర్ లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. 12 మంది పై కేసులు నమోదు చేశామన్నారు.