బీబీపేటలో దారుణం

ABN , First Publish Date - 2020-10-07T10:54:02+05:30 IST

భూ తగదాలు అన్న దమ్ముల మధ్య హత్యలకు దారి తీస్తున్నా యి. భూమి విషయంలో రక్తం పంచుకొని పుట్టిన సోదరుడినే అన్న హత

బీబీపేటలో దారుణం

తమ్ముడిని చంపిన అన్న భూవివాదం వల్లే.. 


బీబీపేట, అక్టోబరు 6: భూ తగదాలు అన్న దమ్ముల మధ్య హత్యలకు దారి తీస్తున్నా యి. భూమి విషయంలో రక్తం పంచుకొని పుట్టిన సోదరుడినే అన్న హత మార్చగా ఇదే హంతకుడు గతంలో ఆ భూమి కోసమే కన్న తండ్రినే కడతేర్చిన సంఘటన జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసు కుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బీబీపేట మండలం లో నివాసం ఉండే బోయిని రాజు, రాము(37) ఇద్దరు అన్నదమ్ములు. వీరికి గ్రామ శివారులో 6 ఎకరాల భూమి ఉంది. ఇందులోంచి తమ్ముడైన బోయిని రాము పేరిట ఐదెకరాల భూమి ఉండగా అన్న బోయిని రాజు పేరిట ఒక ఎకరం ఉంది. దీంతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గత కొన్ని రోజులుగా భూ విషయంలో తగదాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళ వారం తెల్లవారుజామున తన వ్యవసాయ పొలం వద్దకు రాము వెళ్లడంతో గమనించిన రాజు కర్రలతో తలపై బాధడంతో రాము అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు.


పొలానికి వెళ్లిన రాము ఎంతసేపటికీ తిరిగి రాకపోయే సరికి మృతుడి భార్య తన తమ్మున్ని వెళ్లి చూసిర మ్మని చెప్పగా అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడని కుటుంబీకులకు సమాచారం అందిం చాడు. విషయం తెలుసుకున్న బీబీపేట పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మీ తన భర్తను బోయిని రాజు అతని కూమారు లు భూమి విషయంలో చప్పారంటూ ఫిర్యాదు చేసినట్లు సీఐ యాలాద్రి తెలిపారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని సీఐ పేర్కొన్నారు. ఇదే భూమి విషయంలో గతంలో తమ తండ్రి బోయిని నర్సయ్య ఇద్దరు అన్నదమ్ములకు సమానంగా భూమిని పంచి ఇవ్వలేదనే కారణంగా రాజు కన్న తండ్రినే హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చాడని గ్రామస్థు లు పేర్కొన్నారు.

Read more