రామ మందిర నిర్మాణానికి సహకరించాలి
ABN , First Publish Date - 2020-12-28T05:33:52+05:30 IST
అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని మూడు రాష్ర్టాల ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు.

మద్నూర్, డిసెంబరు 27: అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని మూడు రాష్ర్టాల ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ఏర్పాటు చేసిన మ ద్నూర్, జుక్కల్ మండలాల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రామ మందిర ని ర్మాణానికి అందరి సహకారం ఉండే విధంగా విశ్వహిందూ పరిషత్ ఆ ధ్వర్యంలో ప్రతీ గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ హిందువు ఇంటికి వెళ్లి అయోధ్యలో నిర్మిస్తున్న రామ మంది ర నిర్మాణానికి నిఽధి సేకరణ చేయాలని సూచించారు. శ్రీ రామ జన్మ భూమి నిర్మాణ నిధి సేకరణ ఉద్యమంలో భాగంగా పాల్గొని ఇంటింటి కీ వెళ్లి కరపత్రాలను పంచుతూ మందిర నిర్మాణంలో తమవంతుగా ఎంతో కొంత నిధి సేకరణకు కృషిచేయాలని కోరారు. రామ మందిర నిర్మాణానికి 10 రూపాయలు, వంద రూపాయల, వెయ్యి రూపాయల కూపన్లు ఉన్నాయనిన్నారు. ప్రతీ హిందువు తమకు తోచిన విధంగా విరాళాలు అందజేయవచ్చన్నారు. కార్యకర్తలు ప్రతీ ఇంటింటికీ తిరగా లని కోరారు. కార్యక్రమంలో విభాగ్ ప్రచారక్ నరేష్, బెజుగం సత్యనా రాయణ, జిల్లా కార్యకారిణి భానుదాస్, సంతోష్ పాల్గొన్నారు.