పట్టణ ప్రగతిలో పురస్కారాలు అందేనా?

ABN , First Publish Date - 2020-12-28T05:17:19+05:30 IST

మున్సిపాలిటీలను అందంగా తీర్చిదిద్దాలనే ఉ ద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిలో భాగం గా ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులతో ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు చకచకాసాగుతున్నాయి. మున్సిపల్‌ పరిధిలో మౌ లిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నె లా నిధులు కేటాయిస్తుండడంతో పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి.

పట్టణ ప్రగతిలో పురస్కారాలు అందేనా?

పట్టణ ప్రగతిపై పురస్కారాలు అందజేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్‌, మున్సిపాలిటీలలో పనులపై అధికారులు దృష్టి సారించేనా?

అధికారులు అలసత్వం వీడితే పుర స్కారం వచ్చే అవకాశం

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

కామారెడ్డి, డిసెంబరు 27: మున్సిపాలిటీలను అందంగా తీర్చిదిద్దాలనే ఉ ద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిలో భాగం గా ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులతో ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు చకచకాసాగుతున్నాయి. మున్సిపల్‌ పరిధిలో మౌ లిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నె లా నిధులు కేటాయిస్తుండడంతో పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగ ంగా చేపట్టిన పనుల్లో వేగం, నాణ్యత పెంపోంది ంచేందుకు పోటీలు నిర్వహిస్తోంది. పోటీల్లో నిలి చేందుకు 14 అంశాలపై ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనవరి నెలాఖరు వరకు దరఖా స్తులు స్వీకరించి ఫిబ్రవరి 24వ తేదీన ఫలితాలు ప్రకటించనుంది. అయితే, ఉమ్మడి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల పరిధిలో పాలకవర్గాలు ప్రగతి పై దృష్టిసారిస్తున్నప్పటికీ సిబ్బంది కొరత, మరి కొన్నిచోట్ల ఉన్న సిబ్బంది అలసత్వం వీడకపోవ డంతో పనులు నెమ్మదిస్తున్నట్లు తెలుస్తోంది.

పోటీ అంశాలు ఇవే..

ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, కామారెడ్డి, బా న్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు ఉన్నాయి. ప ట్టణ ప్రగతిలో కేటాయిస్తున్న నిధులతో ఈ ము న్సిపాలిటీల్లో 14 అంశాల్లో పనులు కొన సాగుతున్నాయి. ప్రజా మరుగు దొడ్ల నిర్వహణ, వైకుంఠఽ దామాలు, చిట్ట డవుల పెంపకం, మొక్కలు నాటడం-సంరక్షించడం, ఇం కుడు గుంతల నిర్మాణం, తడి-పొడి చెత్తసేకరణ, చెత్త రీసైక్లింగ్‌, స్వచ్ఛమైన తాగునీటి సరాఫరా, ఓపెన్‌ జిమ్‌లు, ఆట స్థలాలు, మార్కెట్ల నిర్మాణ ం, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, మానవ వ్యర్థాల శు ద్ధి, నర్సరీల పెంపకం వంటి అంశాల్లో అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే మున్సి పాలిటీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జ నవరి నెలఖారు వరకు దరఖాస్తు చేసుకునే అవ కాశం ఉంటుంది.

వెబ్‌సైట్‌లో దరఖాస్తులు

మున్సిపాలిటీలు ఉత్తమ పురస్కారాల కోసం సీడీఎంఏ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత సాధిస్తే వారికి ప్రగతి వారోత్స వాలు నిర్వహించి పురస్కరాలు సైతం అందించ నున్నారు. అవార్డుతో పాటు నగదు పురస్కరాలు అందజేయడం లేదా గ్రేడింగ్‌ ప్రకటించనున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన నాలుగు విభాగాలుగా గుర్తించారు. ఒకటి 25 వే ల జనాభా వరకు, రెండోది 25 నుంచి 50 వేల జనాభా, మూడోది 50 వేల నుంచి లక్ష వరకు జ నాభా, నాలుగోది లక్ష నుంచి 3 లక్షల జనాభా వ రకు విభాగాలుగా పోటీలు నిర్వహించనున్నారు.

పనులు చకచకా

ఉమ్మడి జిల్లాలో పట్టణ ప్రగతిలో పనులు చక చకా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల అధికారుల అ లసత్వం, మరికొన్నిచోట్ల సిబ్బంది కొరత కారణ ంగా పనులు నెమ్మదిస్తున్నట్లు తెలుస్తోం ది. కామారెడ్డి జిల్లాలోని కామా రెడ్డి మున్సిపాలిటీలో ఓపెన్‌ జిమ్‌లు, శానిటేషన్‌ పనులు, మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్‌ ఏర్పా టు కాగా, తడి, పొడి చెత్త వేరు చేయడం, రీసై క్లింగ్‌ చేయడంలాంటి పనుల్లో వేగిరం పెరిగింది. నర్సరీల పెంపకం పనులు జరుగుతున్నాయి. ప్ర ధాన కూడళ్ల అభివృద్ధి సైతం త్వరలో జరిగే విధ ంగా మున్సిపల్‌ పాలకవర్గం చర్యలు చేపడుతోం ది. హరితహారంలో భాగంగా ప్రధాన రహదారు ల రోడ్ల వెంట మొక్కలు నాటారు. తడి, పొడి చె త్త సేకరణలో భాగంగా ఇంటింటికీ రెండు బుట్ట లు పంపిణీ చేసి నిత్యం వేరువేరుగా చెత్తసేకరణ చేస్తున్నారు. పట్టణంలో కొనసాగుతున్న శానిటేష న్‌ పనులను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్న వి ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఎప్పటికప్పుడు శాని టేషన్‌ అధికారులకు పలు సూచనలు చేస్తున్నా రు. అయితే శానిటేషన్‌ పనులలోనే వేగిరం కని పిస్తుండగా మిగిలిన పనులపై మాత్రం అధికా రులు అలసత్వం వీడడం లేదని సమాచారం. ప ట్టణంలో నీటి సరాఫరా, అభివృద్ధిపై క్షేత్రస్థాయి లో పర్యవేక్షించాల్సిన అధికారులు అలసత్వం వీ డితే కామారెడ్డి మున్సిపాలిటీకి పురస్కారం వచ్చే అవకాశాలు లేకపోలేదనే వాదనలు పట్టణ ప్రజ ల నుంచి వినిపిస్తున్నాయి. శానిటేషన్‌ పనులలో కార్మికులను కలుపుకుని పోతూ పనులు చేయి స్తుండడంతో గతంలో కంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తుండగా నీటి సరాఫరాలో మాత్రం ఇంకా చాలాచోట్ల అలసత్వం కనిపిస్తున్నట్లు సమాచా రం. 49 వార్డులలో నిత్యం ఏదో ఒక చోట నీటి స రాఫరాపై ఫిర్యాదులు వస్తున్నా కేవలం కిందిస్థా యి సిబ్బందికి పనులను అప్పగిస్తుండడం, వాటి ని పర్యవేక్షించాల్సిన అధికారి అంతంత మాత్రం గానే దృష్టిసారించడంతో పనులలో వేగిరం కనిపి ంచడం లేదని తెలుస్తోంది. ఇక బాన్సువాడ, ఎల్లా రెడ్డిలో పనుల వేగిరం చేయాలనే తపన పాలక వర్గంలో ఉన్నప్పటికీ అధికారుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అర ుునా ప్రభుత్వం అందజేసే పురస్కారానికి తనవంతు కృషిచేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-12-28T05:17:19+05:30 IST