పన్నులు వసూలయ్యేనా?

ABN , First Publish Date - 2020-02-12T11:58:04+05:30 IST

జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యానికి గడువు దగ్గ ర పడుతోంది. గడువులోగా అధికారులు నిర్ధే శించుకున్న లక్ష్యం పూర్తయ్యే పరిస్థితులు కన బడడం లేదు. పన్నుల వసూళ్ల కోసం అధికా రులు ఎన్ని అవగాహన

పన్నులు వసూలయ్యేనా?

ఈ ఆర్థిక సంవత్సరం  వసూళ్ల లక్ష్యం రూ. 10.65కోట్లు

ఇప్పటి వరకు వసూలు చేసింది రూ. 4కోట్ల 52లక్షలు

పన్నుల వ సూళ్లకు మిగిలింది నెలన్నర రోజులే..


ఎల్లారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 11: జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యానికి గడువు దగ్గ ర పడుతోంది. గడువులోగా అధికారులు నిర్ధే శించుకున్న లక్ష్యం పూర్తయ్యే పరిస్థితులు కన బడడం లేదు. పన్నుల వసూళ్ల కోసం అధికా రులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వ హించి, స్పెషల్‌ డ్రైవ్‌లు చేసినా.. ప్రజల నుం చి స్పందన కరువవుతోంది. ముఖ్యంగా జిల్లా  లో కొన్ని మండలాలలోని పలు గ్రామాలు, మారుమూల ప్రాంతాలలో పన్ను వసూళ్లు న త్తనడకన సాగుతున్నాయి. ఓ వైపు కార్యద ర్శుల కొరత, మరోవైపు గ్రామాలలో ఉన్న స మస్యలు, పెండింగ్‌ పనులలో బిజీగా మారా రు. ప్రస్తుతం కార్యదర్శులు ఇంటిపన్నుల వ సూళ్లు కోసం గడువు దగ్గరపడుతుండడంతో గ్రామాలలో పన్నుల వసూళ్లు కోసం ఇళ్ల చు ట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ఇప్పటికే స్పెష ల్‌ డ్రైవ్‌లు చేపట్టిన జిల్లా పంచాయితీ అధి కారులు ఆ దిశగా చర ్యలకు శ్రీకారం చుట్టినప్పటికీ గడు వులోగా లక్ష్యానికి చేరువవు తారా? లేదా అన్నది చూడా ల్సి ఉంది. 2019-20 ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 546 గ్రామపంచాయతీల ద్వారా రూ. 10 కోట్ల 65లక్షల్లు ల క్ష్యం కాగా, ఇప్పటివరకు వ సూలు చేసింది రూ. 4కోట్ల 52లక్షలు మాత్రమే వసూలు చేశారు. మిగతా పన్నుల వసూళ్లకు ఇంకా నె ల 15 రోజులు మిగిలి ఉండగా, పంచాయతీ కార్యదర్శులు లక్ష్యం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. కాగా ఇప్పటినుంచి మార్చి 31 వ రకు కీలకం కానుండడంతో లక్ష్యాన్ని చేరుకుం టామని పంచాయతీ అధికారులు పేర్కొంటు న్నారు. ఇందుకోసం స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహి స్తున్నారు. అయితే ఇటీవల జరిగిన పంచా యతీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారుగా రూ. 50లక్షల వరకు పన్నుల రూపంలో జమైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారులు కా ర్యదర్శులకు రోరాఈగా లక్ష్యాన్ని నిర్ధేశిస్తున్న ప్పటికీ పన్ను వసూళ్లు విషయంలో లక్ష్యానికి దూరంగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే గ డువులోపు లక్ష్యాన్ని చేరుకుంటామని మాత్రం జిల్లా పంచాయతీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


జిల్లాలో 546 గ్రామపంచాయతీలు..

కామారెడ్డి జిల్లాలో 546 గ్రామపంచాయ తీలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప న్నుల వసూళ్లు కోసం పంచాయితీ కా ర్యదర్శులు గ్రామాలలో ఇంటింటికీ ప ర్యటిస్తున్నారు. పన్ను వసూళ్లు కోసం పంచాయతీ అధికారులు స్పెషల్‌ డ్రై వ్‌లు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో లక్ష్యానికి సమయం సమీపిస్తుండడం తో సిబ్బంది ఉరుకులు, పరుగులు పె డుతూ వసూళ్లు రాబట్టడంపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 2019, మార్చి 31లోపు ప న్నుల వసూళ్ల లక్ష్యం రూ. రూ. 10 కో ట్ల 65లక్షలు, ఇప్పటివరకు వసూళ్లు చేసింది రూ. 4కోట్ల 52లక్షలు మాత్రమే వసూళ్లు చే శారు. ఇందులో ఇంటి పన్నులు, దుఖాణా స ముదాయాలు, సంతలు తదితర వాటి నుంచి వసూళ్లు చేశారు. కాగా గతేడాది 2018-19 ఆ ర్థిక సంవత్సరానికి గానూ పన్ను వసూళ్లుకు జిల్లాలో రూ. 13 కోట్ల లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా అందులో సుమారుగా రూ. 12 కోట్ల వసూళ్ల తో లక్ష్యానికి చేరువయ్యారు. 2019-20 ఈ ఆ ర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు సమయం లో గ్రామపంచాయతీ ఎన్నికల విధులు, ఇత ర పనులతో జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడంతో పంచాయతీ కార్యదర్శుల ప న్నుల వసూళ్లపై దృష్టి సారించారు. అయితే వీరు గడువులోపు లక్ష్యాన్ని చేరుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

 

పూర్తి చేయడం సాధ్యమేనా ?

మార్చి 31 ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వ సూళ్ల కోసం నిర్ధేశించిన లక్ష్యాన్ని జిల్లా పంచా యతీ అధికారులు చేరడం అనుమానంగానే కనిపిస్తోంది. ఇటీవల గ్రామపంచాయితీ ఎన్ని కలలో పూర్తిగా అధికారులు, సిబ్బంది నిమ గ్నం కావడంతో కాస్త పన్నుల వసూళ్లపై దృ ష్టి సారించలేకపోయారు. అయితే ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం పన్నుల వసూళ్లుపై దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడిప్పుడే పన్ను వసూళ్లు ప్రారంభించిన అధికారులు ముందు గా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నవాటిపై దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టారు. ఆర్థిక సంవత్సరం మరో నెలన్నర రోజుల్లో ముగియనుండడంతో సి బ్బంది పూర్తిస్థాయిలో తమ దృష్టిని పన్నుల వసూళ్లుపై పెట్టారు. అయితే గడువులోపు ల క్ష్యాన్ని సాధిస్తామని మాత్రం అధికారులు ధీ మా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగం గా నే ఆ శాఖ ఉన్నతాధికారులు లక్ష్యాన్ని చేరుకో వాలని సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టి స్తున్నారు. 

Updated Date - 2020-02-12T11:58:04+05:30 IST