వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-10-03T10:05:07+05:30 IST

పట్టణంలోని గాంధీ చౌక్‌లో శుక్రవారం కేంద్ర ప్రభు త్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కాంగ్రెస్‌ నియోకవ ర్గ ..

వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలి

బాన్సువాడ, అక్టోబరు 2: పట్టణంలోని గాంధీ చౌక్‌లో శుక్రవారం కేంద్ర ప్రభు త్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కాంగ్రెస్‌ నియోకవ ర్గ ఇన్‌చార్జీ కాసుల బాల్‌రాజ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌తో రాష్ట్ర ఖజానాను నింపుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ కాసుల బాల్‌రాజ్‌, నాయకులు ఖాలెక్‌, నర్సన్నచారీ, మధుసూదన్‌, రోహిత్‌, రవీందర్‌ రెడ్డి, అజీం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


నిజాంసాగర్‌: కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన రైతు వ్యతిరేక బిల్లుల ను నిరసిస్తూ శుక్రవారం నిజాంసాగర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ బీ జేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేక బిల్లులు తీసుకువచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సవాయిసింగ్‌, వెంకటేశం, లోక్యానాయక్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-10-03T10:05:07+05:30 IST