జిల్లాలో మరో పది పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-08T11:06:21+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత రోజురో జుకూ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే మరో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో మరో పది పాజిటివ్‌

జిల్లాలో 39కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

మంగళవారం కొత్తగా 10 కేసులు నమోదు

పాజిటివ్‌ ప్రాంతాల్లో మరో 5 క్లస్టర్‌ల ఏర్పాటు

కరోనా తీవ్రతతో ఎక్కడికక్కడే కట్టడి

ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటుకు సిద్ధమవుతున్న జిల్లా అధికారులు

ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి


నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత రోజురో జుకూ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే మరో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 39కి చేరింది. పాజిటివ్‌ కేసులు పెరగడంతో జిల్లాలో మరో ఐదు ప్రాంతాల ను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించి రాకపోకలను నియంత్రించారు. ప్రజలు బయటకు రాకుండా చర్య లు చేపడుతున్నారు. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారు కలిసిన 600 మందికి పైగా క్వారంటైన్‌లకు తరలించారు. 38 మందికి పైగా నగరంలోని ఐసోలే షన్‌ వార్డులలో ఉంచారు.


ప్రతీరోజు కొంత మంది రక్తనమూనలను హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మరి న్ని ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లుగా ప్రకటిం చేందుకు చర్యలు చేపడుతున్నారు. నగరంలో లాక్‌ డౌన్‌ సమయాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. జిల్లాలో వ్యవసాయ పనులకు మినహా ఇతర పనులకు అనుమతించవద్దని నిర్ణయం తీసుకు న్నారు. ఇప్పటికే ప్రకటించిన క్లస్టర్‌ల ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో మొబైల్‌ వ్యానులతో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తు వులను అందుబాటులో ఉంచారు. 


మెరుగైన వైద్య సేవలకు కృషి..

జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండ డంతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధి కారులు కృషి చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జన రల్‌ ఆసుపత్రితో పాటు పీహెచ్‌సీల పరిధిలో సిబ్బ ంది కొరత ఉన్నప్పటికీ దానిని అధిగమిస్తూనే సేవ లను అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆ సుపత్రిని కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయ త్నాలు మొదలుపెట్టినప్పటికీ ఇతర రోగులకు ఇబ్బ ంది వస్తుందని వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రైవేట్‌ నర్సింగ్‌హోం తో పాటు ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి సేవలను అందించేందుకు సిద్ధమవు తున్నారు. అది కూడా సరిపోని పరిస్థితి వస్తే జనరల్‌ ఆసుపత్రిలోనే ఏర్పాటు చేయనున్నారు.


క్వారంటైన్‌లకు ఎక్కువ మందిని తరలించినందున అక్కడ ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతు న్నారు. కొన్ని చోట్ల అవసరం లేకున్నా ప్రజలు బయ టకు వస్తుండడంతో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేసుల సంఖ్య పెరుగుతు న్నందున ప్రజలు దూరం పాటించడంతో పాటు అ వసరమైతే తప్పా బయటకు రావద్దని కలెక్టర్‌ నారా యణరెడ్డి కోరారు. నిత్యావసర వస్తువులతో పాటు ఇతర సమస్యలను ఎదురుకాకుండా ఏర్పాట్లను చేశామని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-04-08T11:06:21+05:30 IST