పశుపోషణపై దృష్టి సారించాలి
ABN , First Publish Date - 2020-12-14T04:31:38+05:30 IST
పశుపోషణపై దృష్టి సారించాలని మండల పశు వైద్యాధికారి కిరణ్‌దేశ్‌పాండే తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

మాక్లూర్, డిసెంబరు13: పశుపోషణపై దృష్టి సారించాలని మండల పశు వైద్యాధికారి కిరణ్‌దేశ్‌పాండే తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని మెట్టు గ్రామంలో సోమవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ఉచిత నట్టల వ్యాధి నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. గ్రామాల్లో ఎంపీపీ మాస్త ప్రభాకర్, జేడీ ఎల్లన్న పాల్గొంటారని పేర్కొన్నారు, రైతులు పాల్గొనాలని కోరారు.
పెంపకందారులు టీకాలు వేయించాలి
సిరికొండ : మేకలు, గొర్రెల పెంపకందారులు తమ జీవాలకు టీకాలు వేయించాలని పశువైద్యాదికారి డాక్టర్ బాబురావు తెలిపారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మొదటి సారిగా ఆవులకు, గేదెలకు నట్టల వ్యాధి నివారణ మాత్రలను పంపిణీ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు అన్ని గ్రామాలు, తండాలలో మాత్రలను పంపిణీ చేస్తున్నందున రైతులు, పశుపోషకులు తీసుకెళ్లాలని తెలిపారు. రెండు బృందాలుగా ఏర్పడి గ్రా మాల్లోకి వెళ్లి అవగాహన కల్పించనున్నామన్నారు.
నేటి నుంచి పశువులకు నట్టల వ్యాధి నివారణ మందు పంపిణీ
జక్రాన్‌పల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం నుంచి ఈనె ల 23 వరకు పశువులకు, ఆవులకు, దుడలకు నట్టల వ్యాధి నివారణ మందు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పశువైద్యాధికారిణి డాక్టర్ శి రీష తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమ వారం కొలిప్యాక్, మనోహరాబాద్, 15న వివేక్‌నగర్‌తండా, జక్రాన్‌పల్లి, 16న బ్రాహ్మణ్‌పల్లి, తొర్లికొండ, 17న చందమియాబాగ్‌తండా, పడకల్‌లో మందులను పంపిణీ చేయనున్నామన్నారు. 18న కలిగోట్, చింతలూర్, 19న మునిపల్లి, నల్లగుట్టతండా, లక్ష్మాపూర్, 21న అర్గుల్, నారాయణపే ట్, 22న పుప్పాలపల్లి, మాదాపూర్, గన్యాతాండా, 23న కేశ్‌పల్లి, సికింద్రా పూర్ గ్రామాల్లో పశువులకు, ఆవులకు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలని తెలిపారు. పశు సంపదను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.