శ్మశానవాటిక కోసం స్థలాన్ని కేటాయించాలి

ABN , First Publish Date - 2020-12-31T05:08:09+05:30 IST

శ్మశానవాటిక కోసం స్థలాన్ని కే టాయించాలని 18వ డివిజన్‌ పరిధిలోని తారకరామనగర్‌ వాసులు కోరా రు. బుధవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

శ్మశానవాటిక కోసం స్థలాన్ని కేటాయించాలి

నిజామాబాద్‌ రూరల్‌, డిసెంబరు 30 : శ్మశానవాటిక కోసం స్థలాన్ని కే టాయించాలని 18వ డివిజన్‌ పరిధిలోని తారకరామనగర్‌ వాసులు కోరా రు. బుధవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్వేనెంబర్‌ 203/1లో ఎకరానికి పైగా స్థలం ఉందని, దానిని కబ్జా చేసుకునేందుకు యత్నిస్తున్నారని ఆరో పించారు. 30 ఏళ్లుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముబారక్‌నగర్‌ శ్మశానవాటికలోనే దహన సంస్కారాలు చేస్తున్నామన్నారు. రూరల్‌ తహసీల్దార్‌ స్థల పరిశీలన చేసి కేటాయిస్తారని ఈ సందర్భంగా కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-12-31T05:08:09+05:30 IST