మహిళలందరినీ గ్రూపుల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-11T05:13:56+05:30 IST

జిల్లాలో ఇంకా ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో చేరకుండా ఉన్న మహిళలను గుర్తించి వారిని సభ్యులుగా చే ర్చి రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగే విధంగా చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి డీఆర్‌ డీఏ అధికారులను ఆదేశించారు.

మహిళలందరినీ గ్రూపుల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 10:  జిల్లాలో ఇంకా ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో చేరకుండా ఉన్న మహిళలను గుర్తించి వారిని సభ్యులుగా చే ర్చి రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగే విధంగా చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి డీఆర్‌ డీఏ అధికారులను ఆదేశించారు. గురువారం సం బంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మా ట్లాడారు. ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మరో లక్షకు పైగా మహిళలు సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపుల్లో చేరడానికి అవకాశం ఉందని వారందరినీ గుర్తించి గ్రూపుల్లో సభ్యులుగా  చేర్చి  వారిని చైతన్య పరిచి విద్యతో పాటు ఉపాధి పొందే విధంగా చర్యలు తీ సుకోవాలన్నారు. సుమారు 12 వేల గ్రూపులకు సరిపోయే మహిళలు ఉన్నందున వారందరినీ ఇం టింటికీ వెళ్లి గుర్తించి 10 మందికి ఒక గ్రూపుగా తయారుచేసి సభ్యులుగా చేర్పించి బ్యాంకర్‌లతో సంప్రదించి రుణాలు అందే విధంగా చూడాలన్నారు. తద్వారా స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి అవసరమైన రంగాల్లో శిక్షణ ఇప్పించడంతో పాటు కెపాసిటీ బిల్డింగ్‌ ద్వారా వారు ఎదగడానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా పరంగా కూడా కొంత పరిజ్ఞానం సంపాదించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి ప్రారంభించి వచ్చే జనవరి చివరికల్లా పూర్తయ్యేలా చూడాలన్నారు. అర్హ త గల మహిళా గ్రూపులకు ఇంకా రుణాలు అం దకుండా ఉంటే అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొ రవ తీసుకొని రుణాలు అందేలా కృషి చేయాలన్నా రు. కొన్ని మండలాల్లో రుణాల మంజూరు ఆశిం చిన స్థాయిలో లేవన్నారు. ఆ మండలస్థాయి డీఆర్‌ డీవో సిబ్బందిని, ఏపీఎంలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సెల్‌ కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. గురువారం సం బంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మా ట్లాడారు. ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మరో లక్షకు పైగా మహిళలు సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపుల్లో చేరడానికి అవకాశం ఉందని వారందరినీ గుర్తించి గ్రూపుల్లో సభ్యులుగా  చేర్చి  వారిని చైతన్య పరిచి విద్యతో పాటు ఉపాధి పొందే విధంగా చర్యలు తీ సుకోవాలన్నారు. సుమారు 12 వేల గ్రూపులకు సరిపోయే మహిళలు ఉన్నందున వారందరినీ ఇం టింటికీ వెళ్లి గుర్తించి 10 మందికి ఒక గ్రూపుగా తయారుచేసి సభ్యులుగా చేర్పించి బ్యాంకర్‌లతో సంప్రదించి రుణాలు అందే విధంగా చూడాలన్నారు. తద్వారా స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి అవసరమైన రంగాల్లో శిక్షణ ఇప్పించడంతో పాటు కెపాసిటీ బిల్డింగ్‌ ద్వారా వారు ఎదగడానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా పరంగా కూడా కొంత పరిజ్ఞానం సంపాదించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి ప్రారంభించి వచ్చే జనవరి చివరికల్లా పూర్తయ్యేలా చూడాలన్నారు. అర్హ త గల మహిళా గ్రూపులకు ఇంకా రుణాలు అం దకుండా ఉంటే అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొ రవ తీసుకొని రుణాలు అందేలా కృషి చేయాలన్నా రు. కొన్ని మండలాల్లో రుణాల మంజూరు ఆశిం చిన స్థాయిలో లేవన్నారు. ఆ మండలస్థాయి డీఆర్‌ డీవో సిబ్బందిని, ఏపీఎంలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సెల్‌ కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:13:56+05:30 IST