డాటా ఎంట్రీని పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-10-03T10:02:23+05:30 IST

వ్యవసాయేతర భూములు, నిర్మాణాల డాటా ఎంట్రీని పక డ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే ..

డాటా ఎంట్రీని పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, అక్టోబరు 2: వ్యవసాయేతర భూములు, నిర్మాణాల డాటా ఎంట్రీని పక డ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అధికా రులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి, గూడెం గ్రామాల్లో జరుగుతున్న వ్యవసాయేతర భూములు, నిర్మాణాల వివరాలను యాప్‌ ద్వారా డాటా ఎంట్రీ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కొలతల వివరాలను పకడ్బ ందీగా నిర్వహించి వెంటనే యాప్‌లో నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో నరేష్‌, చిన్నమల్లారెడ్డి గ్రామ సర్పంచ్‌ కృష్ణాజిగారి రత్నబాయి ఆనంద్‌రావు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.


కామారెడ్డి 41వ వార్డులో పరిశీలన

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 2: ధరణి పోర్టల్‌లో ప్రతీ వివరాలను పకడ్బందీగా నమో దు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే మున్సిపల్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని 41వ వార్డులో కొనసాగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి 58 అంశాలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించాలని ఎక్కడా అలసత్వం వహించవద్దని సిబ్బందికి సూచించారు. ప్రజలు సైతం మున్సిపల్‌ సిబ్బందికి సహకరించి వారి వివరాలను ఎలాంటి గోప్యత లేకుండా అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఆర్‌ఐ జానయ్య, సిబ్బంది రవీందర్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T10:02:23+05:30 IST