తరగతులు నిర్వహిస్తే చర్యలు
ABN , First Publish Date - 2020-03-16T10:30:48+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాను సారం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా జిల్లాలోని
కామారెడ్డి టౌన్, మార్చి 15: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాను సారం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించినట్లు కామారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారి రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ఈనెల 19 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు యథా విధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. సూపరింటెండెం ట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్ షెడ్యుల్ ప్ర కారం పరీక్షాకేంద్రాల్లో విఽధులు నిర్వహించాలని తెలిపారు.