ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2020-12-13T05:42:52+05:30 IST

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో 2020-21 విద్యసంవత్సరానికి ఎస్సెస్సీ, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కో ఆర్డినేటర్‌ పి.లింబాద్రి తెలిపారు.

ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

భీమ్‌గల్‌, డిసెంబరు 12: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో 2020-21 విద్యసంవత్సరానికి ఎస్సెస్సీ, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కో ఆర్డినేటర్‌ పి.లింబాద్రి తెలిపారు. పట్టణంలోని బాలికల హైస్కూల్‌లో దరఖాస్తులను అందజేయాలన్నారు. 9వ తరగతి వరకు చది వి 14 సంవత్సరాలు ఉన్న విద్యార్థులతోపాటు పదో తరగతి ఫెయిల్‌ అయి నవారు ఓపెన్‌ పదవ తరగతి అడ్మిషన్‌లకు అర్హులన్నారు. పదో తరగతి పా సైన వారు ఇంటర్‌కు అర్హులన్నారు. ఇందులో ఉత్తీర్ణులైతే రెగ్యూలర్‌ విద్యా ర్థులతో సమానమని పేర్కొన్నారు. జనవరి 5వ తేదీ వరకు అడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని, మిగతా వివరాలకు 9948082804, 9493659695 నెంబర్‌లో సంప్రదించాలని ప్రధానోపాధ్యాయుడు లింబాద్రి తెలిపారు.

వర్ని: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ మీడియట్‌లో ప్రవేశాలకు ధరఖాస్తులు స్వీక రిస్తున్నట్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ గుజ్జ రా ములు తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియంలో ప్రవేశానికి దరఖా స్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు అడ్మిషన్‌ల కోసం ఆధార్‌కార్డులు, ఫోటోలు, కులధృవీకరణ సర్టిఫికేట్‌తో 9080678708 నెంబర్‌ ను సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2020-12-13T05:42:52+05:30 IST