అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

ABN , First Publish Date - 2020-03-21T06:28:07+05:30 IST

దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనూ కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌ అయ్యాయి. ఆయా

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

  • అంతర్‌రాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టుల ఏర్పాటు
  • ఆలయాలు ప్రార్థన మందిరాల మూసివేత
  • మూసి వేస్తున్న కల్యాణ మండపాలు, షాదీఖానాలు

కామారెడ్డి, మార్చి20 (ఆంధ్రజ్యోతి) : దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనూ కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌ అయ్యాయి. ఆయా జిల్లాల యంత్రాగాలను సైతం ప్ర భుత్వాలు అప్రమత్తం చేశాయి. దీంతో జి ల్లాలో కరోనాపై యంత్రాంగం సమరం ప్ర కటించింది. ప్రభుత్వాల ఆదేశాల మేరకు అ ంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వి సృత్తంగా తనిఖీలు చేపడుతున్నారు. విదే శాల నుంచి వచ్చే వారిపై మరింత నిఘా పెట్టారు. ఆదివారం జనతా కర్ప్యూకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అన్ని ప్రార్థానా మందిరాలను మూసి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంద ర్భంగా జిల్లాలోని పలు ఆలయాలు, ప్రార్థ నా మందిరాలను మూసివేశారు. భిక్కనూ రు మండలకేంద్రంలోని దక్షిణకాశీగా బాసీ ల్లుతున్న శ్రీ సిద్ధరామేశ్వర ఆలయాన్ని ఆల య సిబ్బంది శుక్రవారం మూసివేశారు. ప దోతరగతి పరీక్షలను సైతం వాయిదా వే యాలంటు హైకోర్టు ఆదేశించడంతో ఈ ప రీక్షలు కూడా సోమవారం నుంచి నిలిచిపో నున్నాయి. ఇక పెండ్లిళ్లు, శుభకార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం కరోనా వైరస్‌పై అప్రమత్తం అయింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు కరోనా వైరస్‌పై జిల్లా యంత్రాంగాలు యుద్ద ప్రతిపాదికన ప్రత్యేక చర్యలు తీసు కోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం సీఎం కేసిఆర్‌ సైతం జిల్లాల క లెక్టర్‌లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వ హించి దిశ నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతా రెడ్డిలు  రెవెన్యూ, పోలీస్‌, వైద్యారోగ్య, పం చాయతీ తదితర శాఖలను, సిబ్బందితో స మీక్షా సమావేశం నిర్వహించి ప్రభుత్వాలు ఇచ్చిన సలహాలు, సూచనలను వివరించా రు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వా రిపై ప్రత్యేక నిఘా పెట్టాలని వారిని 15 రో జుల పాటు గృహ నిర్భందన చేసి అయిన వైద్య పరీక్షలు చేసి జాగ్రత్తలు తీసుకునేలా సంబంధిత శాఖలకు ఆదేశించారు. జిల్లా లోని ప్రైవేట్‌ వైద్యులతో సైతం సమావేశం నిర్వహించారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రులకు వచ్చేవారిని భయభ్రాంతులకు గురి చేయద్దని స్వచ్చం దంగా బాధితులకు సేవలు అందించాలని కలెక్టర్‌, ఎస్పీలు సూచించారు. అదే విధం గా కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్త చర్య ల్లో భాగంగా మాస్క్‌లు, సానిటరింగ్‌ ల్వికి డ్‌లు కొరత లేకుండా అందుబాటులో త క్కువ ధరలకే అందేలా మెడికల్‌ నిర్వహకు లు సహకరించాలని ఆదేశించారు. కరోనా పై ప్రజల్లో మరింత అవగాహన తీసుకొ చ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ డీఆర్‌డీఏ సిబ్బందిని అప్రమత్తం చేశారు.



చెక్‌పోస్టుల ఏర్పాటు

కరోనా వైరస్‌ విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వారితోనే వ్యాపిస్తున్నందున సరిహ ద్దు ప్రాంతాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అంతర్‌ రాష్ట్ర, జిల్లా చెక్‌పోస్టు లను ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతాల నుంచి వచ్చే వారిపై తనిఖీలు చేయాలని సీఎం కేసిఆర్‌ ఆదేశించిన విషయం తెలి సిందే. అయితే జిల్లాకు పోరుగు రాష్ర్టాలైన మహరాష్ట్ర, కర్ణాటకల్లో పాసిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ర్టాల ను ంచి వచ్చేవారిపై జిల్లా యంత్రాంగం మ రింత నిఘా పెట్టింది. ఇందులో భాగంగా మద్నూర్‌లోని సబలాత్‌పూర్‌ వద్ద, జుక్కల్‌ లో అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చే శారు. స్థానికంగా పోలీస్‌, ఆర్టీవో, రెవెన్యూ, వైద్యరోగ్యశాఖ సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ రాష్ర్టాల నుంచి వచ్చే ప్రతి వాహనాలను, ప్రయాణికులను క్షుణంగా పరిశీలిస్తున్నారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగ త పరిశుభ్రతలపై అవగాహన కల్పిస్తున్నా రు. వీటితో పాటు అంతర్‌జిల్లా చెక్‌ పోస్టు లను సైతం ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చేవారిపై మరింత నిఘా పెట్టారు.


రేపు జనతా కర్ఫ్యూ..

కరోనా వైరస్‌ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ జనతా క ర్ప్యూకు పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజ లంతా స్వచ్చందగా కర్ప్యూ విధించుకోవాల ని, ప్రధానిమోదీ ఆదేశించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్ర జలెవ్వరు బయటకు రాకుండా ఇంటికే పరి మితం కావాలని దీంతో కరోనా వైరస్‌ కొం తైనా నివారించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. ఈ జనతా కర్పూపై పలు పార్టీలు సైతం విసృత్త ప్రచారం చేస్తున్నాయి. జన తా కర్ప్యూలో ప్రజలంతా స్వచ్చందగా పా ల్గొనాలని కోరుతున్నారు. అదే విధంగా ప్ర జలు గుంపులు, గుంపులుగా ఉండవద్దని, రద్దీగల ప్రాంతాల్లో తిరగవద్దని రాష్ట్ర ప్ర భుత్వం సూచించింది. దేవాలయాలు, మసీ ద్‌లు, చర్చిలను కూడా మూసివేయాలని సీఎం కేసిఆర్‌ ఆయా మతాల పెద్దలను కోరారు. దీంతో జిల్లాలోని ప్రధాన దేవాల యాలు, మాసీద్‌లు, చర్చిలను శుక్రవారం మూసివేశారు. అదే విధంగా కళ్యాణ మం డపాలు, షాదీఖానాలను సైతం మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చే శారు. పెండ్లిల ముహుర్తాలు పెట్టుకొని క ల్యాణ మండపాలను ముందుగానే బుకింగ్‌ చేసుకునే వారికి ఈనెల 31 వరకు అను మతి ఇచ్చారు.


పరీక్షలు సైతం వాయిదా..

కరోనా ప్రభావం పదోతరగతి పరీక్షల పై సైతం పడింది. గురువారం నుంచి ప్రా రంభమైన పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 6 వరకు ఉన్నాయి. పదోతరగతి పరీక్షలను యాదవిధిగా నిర్వహిస్తామని ఇది వరకే సీ ఎం కేసిఆర్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిం దే. అయితే శుక్రవారం ఈ విషయమై హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదే శించింది. శనివారం జరగాల్సిన పరీక్ష యా ధాతధంగా జరుగుతుందని అయితే సోమ వారం నుంచి ఈ నెల 30 వరకు జరగాల్సి న వాయిదా పడనున్నట్లు సమాచారం. కా గా ఈ నెల 29న అత్యున్నత స్థాయి సమా వేశం తరువాత పరీక్షలు ఎప్పుడు నిర్వ హి ంచాలి అనే విషయంపై తదుపరి నిర్ణ యం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పరీక్షల వాయిదాపై తమకు ఇప్పటి వరకు ఎలాం టి అధికారిక ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదని విద్యాశాఖధికారులు పేర్కొంది.

Updated Date - 2020-03-21T06:28:07+05:30 IST