జిల్లాలో 75 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-07-20T11:18:09+05:30 IST

జిల్లాలో గత మూడు నెలల నుంచి ఎప్పుడు లేనివిధంగా రికార్డు స్థాయిలో ఆదివారం కరోనా పాజి టివ్‌ కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో 75 కరోనా పాజిటివ్‌ కేసులు

కామారెడ్డి, జూలై 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత మూడు నెలల నుంచి ఎప్పుడు లేనివిధంగా రికార్డు స్థాయిలో ఆదివారం కరోనా పాజి టివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 75 పాజిటివ్‌ కేసులు నిర్ధార ణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి డివిజన్‌లో 40 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలో 19, బాన్సువాడ డివిజన్‌లో 16 నమోదైనట్లు తెలిసిం ది. జిల్లా అధికారుల రిపోర్టు ఇలా ఉండగా.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటిన్‌లో 67 కేసులు ఉన్నట్లు ప్రకటించా రు. ప్రస్తుతం జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రులతో పాటు 20 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ కరోనా ర్యాపి డ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తుండడంతో కేసులు అత్యధికంగా వెలువడుతున్న ట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-07-20T11:18:09+05:30 IST