మృత్యుదారి!
ABN , First Publish Date - 2020-05-18T09:28:05+05:30 IST
4వ నెంబర్ జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారింది. ఈ రహదారిపై ప్రమాదాలు జ రగని రోజుంటూ ఉండడం లేదు.

44వ నెంబర్ జాతీయ రహదారిపై తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలు
దారిపొడవునా కనిపించని వేగ నిరోధకాలు
పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు
డిచ్‌పల్లి, మే 17: 44వ నెంబర్ జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారింది. ఈ రహదారిపై ప్రమాదాలు జ రగని రోజుంటూ ఉండడం లేదు. దీనికి ప్రధాన కారణం ర హదారిపై వాహన చోదకులు అతివేగంగా, అజాగ్రత్తగా, మ ద్యం తాగి వాహనాలు నడపడమే. వాహనాచోదకులు ప్ర మాదాల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నా ఇటు పో లీసులు గానీ అటూ రోడ్డు భద్రత అధికారులు గానీ ప్రమా దాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జాతీ య రహదారిపై నాగపూర్ నుంచి హైదరాబాద్ వరకు ని త్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరగడం సర్వసాధరణం అయిపోయింది. శనివారం తెల్లవారు జూమున 3 గంటల ప్రాంతంలో మెంట్రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని నాకా తండా వద్ద ఆగివున్న టిప్పరును బీహార్ నుంచి కేరళ వెళ్తు న్న స్కార్పియో కారు అతివేగంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిం దే. లాక్‌డౌన్ నేపథ్యంలో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలే అనుమతు లు ఇవ్వడంతో గమ్యం చేరాలనే తొందరల్లో వాహన చోదకు లు అతి వేగంతో ఆజాగ్రత్తగా వాహనాలు నడిపి విలువైన ప్రాణాలను పొగుట్టుకుంటున్నారు.
జాతీయ రహదారిపై ఇ టీవలే సుద్దపల్లి సీఎంసీ కళాశాల వద్ద మోటార్ సైకిల్‌పై వెళ్తున్న సిరికొండ మండలం కొండూర్ గ్రామానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడిన విషయం విదితమే. జాతీయ రహదారిపై ప్రమాదాకరమైన మలుపుల వద్దగానీ ప్రమాదా ల జరిగే ప్రాంతాల్లో రోడ్లు భవనాల శాఖ అధికారులు ని యంత్రణ చర్యలపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయక పోవడంతో ఈ ప్రమాదాలు రోజురోజుకూ అధికం అవుతు న్నాయి. జాతీయ రహదారి సాంపల్లి వద్ద ఇందల్వాయి టో ల్ ప్లాజా వద్ద, బీబీపూర్ తండా వద్ద ఇటీవల జరిగిన ప్రమా దాలు వాహనా చోదకులకు భయందోళనకు గురిచేస్తున్నా యి. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో తర చూ ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు పకడ్బందీ చర్య లు తీసుకోకపోవడంతో ప్రమాదాలు రోజురోజుకు అధికమవు తున్నాయి. టోల్ గేట్ వద్ద హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న లారీ డివైడర్లపై నుంచి దూసుకెళ్లిన విషయం తెలి సిందే. ప్రమాదాలకు గురవుతున్న జాతీయ రహదారిపై వేగ నిరోధకాలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండ జాతీయ రహదారిపై వేగ నియంత్రణ రేఖలు ఏర్పాటు చేయాలని వా హనచోదకులు కోరుతున్నారు.
జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనచోదకులు ఇంటికి వచ్చే వరకు నమ్మకంలేకుండా పో తోందంటే ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇట్టే తెలుస్తోంది. ప్రమాదాల్లో గాయపడిన వారిని వెంటనే చికి త్స కోసం ఆస్పత్రిలోకి తరలించాలంటే కామారెడ్డి, నిజామా బాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు తప్ప మరే ఆస్పత్రు లు అందుబాటులో లేకపోవడంతో తీవ్రంగా గాయపడ్డవారి ఆయువు మార్గమధ్యలోనే అనంతవాయువుల్లో కలిసిపోతోం ది. ఇప్పటికైనా పోలీసులు, రోడ్డు భద్రత అధికారుల స్పం దించాలని, అలాగే ఇందల్వాయి టోల్ గేట్ పక్కన గతంలో కేటాంచిన స్థలంలో అదునాతన వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.